
జనం న్యూస్: తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. యూరియా కోసం గంటల తరబడి లైన్‌లలో నిల్చునే అవసరం లేకుండా, ఇంటి నుంచే బుక్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తుంది.తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది యూరియా కోసం గంటల తరబడి లైన్‌లలో నిల్చునే అవసరం లేకుండా, ఇంటి నుంచే బుక్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తుంది. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రాష్ట్రంలో ఈ రబీ సీజన్ నుంచి యూరియా పంపిణీన/ అమ్మకాలను సులభతరం చేసేందుకు రైతుల కోసం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టుయూరియా పంపిణీని సులభతరం చేసేందుకు రైతుల కోసం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు చెప్పారు. ఈ యాప్ ద్వారా… రైతులు యూరియా బస్తాల కోసం క్యూ లైన్‌లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, తమకు నచ్చిన డీలర్ నుండి ఇంటి నుండే యూరియాను బుక్ చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌లో యూరియా కోసం ఏర్పడిన గందరగోళ పరిస్థితులను నివారించేందుకు ఈ యాప్ ఉపకరిస్తుందని భావిస్తున్నారు. ఈ సందర్బంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ యూరియా, ఇతర ఎరువుల అధిక వినియోగం వల్ల మానవ ఆరోగ్యంపై కలిగే దుష్ప్రభావాల గురించి, అలాగే పంట వ్యర్థాలను కాల్చడం వల్ల కలిగే చెడు ప్రభావాల గురించి రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎరువుల దుకాణాల వద్ద రైతుల విలువైన సమయాన్ని వృథా చేయకుండా ఉండేందుకు యూరియా పంపిణీ కోసం ప్రత్యేకంగా యాప్‌ను ప్రవేశ పెడుతున్నట్లు తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులు తమ భూమి విస్తీర్ణం ఆధారంగా ఈ మొబైల్ యాప్ ద్వారా సమీప డీలర్‌తో పాటు జిల్లాలోని తమకు నచ్చిన ఏ ఇతర డీలర్ వద్దనైనా యూరియాను బుక్ చేసుకోవచ్చని చెప్పారు. వారు స్టాక్ లభ్యత గురించి కూడా తెలుసుకోవచ్చని అన్నారు.యూరియాలను బుక్ చేసుకున్న తర్వాత. ఆ రైతు మొబైల్ ఫోన్‌కు ఒక బుకింగ్ ఐడీ వస్తుంది. ఆ ఐడి ఆధారంగా రైతులు బుక్ చేసుకున్న డీలర్ నుండి యూరియాను పొందవచ్చని చెప్పారు. మొబైల్ యాప్ ద్వారా యూరియా బుకింగ్‌లో ఏవైనా సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించడానికి ఒక ఫిర్యాదుల పరిష్కార కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. యూరియా వినియోగంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామి రాష్ట్రాలలో ఒకటిగా ఉందని. దాని దుర్వినియోగాన్ని నివారించడానికి, ఆ సీజన్‌లో పంటలు పండించే రైతులకు మాత్రమే యూరియా బుక్ చేసుకునే సౌకర్యం ఈ యాప్‌లో ఉంటుందని మంత్రి తుమ్మల తెలిపారు. ఈ యాప్‌లో రైతులు/పౌరులు, డిపార్ట్‌మెంటల్ అధికారులు, డీలర్ల కోసం ప్రత్యేక లాగిన్ ఎంపికలు ఉంటాయని చెప్పారు. ఇక, రైతు సాగు చేసే ఎకరాలను బట్టి వారికి అవసరమయ్యే యూరియా బ్యాగులు యాప్‌లో కనిపిస్తాయి. అయితే వారు సాగు చేసే విస్తీర్ణాన్ని బట్టి వారికి అవసరమయ్యే యూరియా బస్తాలను 15 రోజుల వ్యవధితో 1 నుంచి 4 దశల్లో అందచేసేలా వివరాలు కనిపిస్తాయి. పాస్‌బుక్‌లు లేని రైతులు వారి పట్టా పాస్‌బుక్ దగ్గర ఆధార్ సెలెక్ట్ చేసుకొని, ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, ఓటీపీ కన్ఫర్మేషన్ చేసిన తర్వాత యూరియా బస్తాలను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.