
సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన భవిష్యత్ కార్యచరణ ప్రకటించారు. 2028 ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. సామాజిక తెలంగాణయే తన ధ్యేయం అని చెప్పుకొచ్చారు. ఎక్స్ వేదికగా ఆస్క్ కవిత అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. నాణ్యమైన, మెరుగైన ఉచిత విద్య, వైద్యం ప్రజలకు అందాలన్నారు.సామాజిక న్యాయం కోసం జాగృతి పోరాటం కొనసాగుతుందని కవిత వెల్లడించారు. సామాజిక తెలంగాణయే తన లక్ష్యమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి స్పష్టం చేశారు. 2028 ఎన్నికల్లో తాము పోటీలో ఉంటామని తేల్చిచెప్పారు. సోమవారం ఆస్క్ కవిత హ్యాష్ ట్యాగ్ పై ట్విట్టర్ (ఎక్స్)లో పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె వివరంగా సమాధానాలు ఇచ్చారు. తెలంగాణ విషయంలో తన విజన్, జాగృతి భవిష్యత్ కార్యాచరణ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు సహా పలు ప్రశ్నలను నెటిజన్లు సంధించారు. వాటికి కవిత ఇచ్చిన సమాధానాలు. ట్విట్టర్ (ఎక్స్) పాలిటిక్స్ విభాగం లో ఆస్క్ కవిత ఇంటరాక్షన్ నంబర్ వన్‌గా నిలిచింది. 2028 ఎన్నికల్లో పోటీ చేస్తాం సామాజిక తెలంగాణ తన ధ్యేయమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు.యువత, మహిళలు వారికి నచ్చిన రంగాల్లో అవకాశాలు పొందాలని...అందుకు వారిని ప్రోత్సహించాల్సిన అవసరముందని అన్నారు. యువత, మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించేందుకు జాగృతి కృషి చేస్తుందన్నారు. కొత్త పార్టీకి సంబంధించి అడిగిన ప్రశ్నకు క్లారిటీ ఇచ్చారు. 2028ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు సూచించిన పేరునే పార్టీకి పెడుతామన్నారు. తెలంగాణ సాధికారిత సాధించాలంటే మెరుగైన, నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం ప్రజలకు అందాలని అన్నారు. తెలంగాణ లో తల్లితండ్రులు పిల్లల చదువుకోసం ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టకుండా ఉండే పరిస్థితి రావాలన్నారు. ఉద్యోగాలు, స్కిల్, భద్రత మూడింటిలో దేనికి ప్రాధాన్యం ఇస్తారని ప్రశ్నించగా... యువతకు ఉద్యోగాలు కల్పించటమే తన ప్రథమ ప్రాధాన్యమని చెప్పారు. ఉద్యోగాలతో పాటు వారికి భద్రత కూడా కల్పించాలన్నారు. సామాజిక న్యాయం కోసం జాగృతి పోరాటం కొనసాగుతుందన్నారు. క్రమంగా జాగృతిని చాలా బలంగా తయారు చేస్తామని చెప్పారు. త్వరలోనే జాగృతి మెంబర్ షిప్ డ్రైవ్ కూడా ప్రారంభిస్తామన్నారు. అదే విధంగా మేము వేసిన కమిటీల్లో ఇప్పటికే అన్ని వర్గాలకు అవకాశం ఇచ్చామని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.