
జనం న్యూస్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఉదయం మూడు దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అయితే ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఉదయం మూడు దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అయితే ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. సోమవారం తెల్లవారుజాము నుంచి దేశ రాజధాని ఢిల్లీలోని పొగమంచు కమ్మేసింది. దీంతో ప్రధాని మోదీ ప్రయాణం ఆలస్యమైంది. వివరాలు. ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటన చేపట్టనున్నారు. మోదీ తొలుత జోర్డాన్ చేరుకోనున్నారు. ఆ తర్వాత మంగళవారం ఇథియోపియాకు చేరుకుని. డిసెంబర్ 17, 18 తేదీల్లో ఒమన్‌లో పర్యటించనున్నారు. అయితే ఇందుకోసం ప్రధాని మోదీ ఉదయం 8.30 గంటలకు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరాల్సి ఉంది. అయితే ఢిల్లీని పొగమంచు కప్పేయడం, విజిబులిటీ లేకపోవడం వల్ల తాత్కాలికంగా విమాన కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. దీంతో ప్రధాని మోదీ ప్రయాణించే విమానం కూడా ఆలస్యంగా బయలుదేరాల్సి వచ్చింది. ప్రధాని మోదీ చివరికి ఉదయం 9.30 గంటలకు విమానం ఎక్కారు. ఇదిలాఉంటే, బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబిన్ పాట్నా నుంచి న్యూఢిల్లీ వెళ్లే విమానం వాతావరణ పరిస్థితుల కారణంగా ఆలస్యం అయింది. ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈరోజు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరగనుంది.