తెలంగాణ మంత్రివర్గ ప్రక్షాళనపై టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణ కేబినెట్ ప్రక్షాళన జరగనుందా? అంటే, అవుననే సమాధానమే వినిపిస్తుంది. తాజాగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇందుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కేబినెట్ ప్రక్షాళన జరగనుందా? అంటే, అవుననే సమాధానమే వినిపిస్తుంది. తాజాగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇందుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న మంత్రులలో మార్పులు - చేర్పులు ఉంటాయా? లేదా శాఖలలో మార్పులు చేస్తారా? అనేది పార్టీ అధిష్ఠానానిదే తుది నిర్ణయమని చెప్పారు. ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మహేష్ కుమార్ గౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ దిశగా ప్రయత్నాలు జరుగుతన్నాయని చెప్పారు. ఈ విషయంలో తనకు స్పష్టత లేదని తెలిపారు. మంత్రివర్గ ప్రక్షాళనకు సంబంధించిముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పార్టీ అధిష్టానం మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సి ఉంటుందని తెలిపారు. తనకు మంత్రివర్గంలోకి వెళ్లే ఉద్దేశం లేదని చెప్పారు. రాష్ట్ర మంత్రికి కూడా ఉండని ప్రాధాన్యం పీసీసీ అధ్యక్షునికి ఉంటుందని వ్యాఖ్యానించారు. అందువల్ల తనకు ఈ పదవిలో కొనసాగడమే ఇష్టమని పేర్కొన్నారు. గతంలోనే తనను మంత్రివర్గంలో తీసుకుందామని అధిష్టానం భావించిందని, మంత్రివర్గంలో చేరితే బాగుంటుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఆహ్వానించారని అయితే తనకు మంత్రి పదవిపై మక్కువ లేదని వారికి చెప్పానని అన్నారు పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతిచ్చిన అభ్యర్థులు అధిక స్థానాల్లో విజయం సాధించారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇది పల్లె ఓటర్లు తమ ప్రభుత్వ పాలనకు మద్దతుగా నిలుస్తున్నారనే దానిపై నిదర్శనం అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు నల్లేరుపై నడకేనని పేర్కొన్నారు. వరుసగా రెండోసారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలు భారీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీలో పెద్ద పెద్ద కంపెనీలు తమ కార్యకలాపాలను ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు. కంపెనీలకు అన్ని రకాలుగా అనుకూలమైన పాలసీలు రూపొందించామని తెలిపారు. టెస్లాను హైదరాబాద్‌కు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని ఆపడం సాధ్యం కాదని ఇది భారతదేశంలోనే అత్యుత్తమ నగరం అని ఆయన పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ కథ ముగిసిపోయిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌కు పునరుజ్జీవనం పొందే అవకాశం లేదని ఆ పార్టీ మరింతగా క్షీణిస్తుందని అన్నారు. బీఆర్ఎస్‌కు భవిష్యత్ లేదని తెలిసే కవిత బయటకు వచ్చారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ రాజకీయ ఇమేజ్‌ను ప్రతిబింబించే నేత బీఆర్ఎస్‌లో ఎవరూ లేరని అన్నారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ఏం జరుగుతుందో కేసీఆర్‌ ముందే ఊహించారని, అందుకే ప్రచారానికి రాలేదని విమర్శించారు. తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం లేదని... ఆ పార్టీ అధిష్టానానికి కూడా ఈ విషయం తెలుసునని అన్నారు.