కోవిడ్ వ్యాక్సిన్‌పై షాకింగ్ అనుమానాలు!

జనం న్యూస్‌: కరోనా మహమ్మారి తర్వాత రోజులలో యువతలో ఆకస్మిక మరణాల సంఖ్య పెరగడం ఆందోళనకు దారితీస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన తాజా అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. కరోనా మహమ్మారి తర్వాత రోజులలో యువతలో ఆకస్మిక మరణాల సంఖ్య పెరగడం ఆందోళనకు దారితీస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ ప్రభావం కూడా కారణం కావొచ్చనే అనుమానాలు కూడా కొందరిలో ఉన్నాయి. అయితే అయితే ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని పలు అధ్యయనాలు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ కూడా తాజా అధ్యయనం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఒక ఏడాది పాటు ఢిల్లీ ఎయిమ్స్ ఈ అధ్యయనాన్ని జరిపింది. ‘‘బర్డెన్ ఆఫ్ సడెన్ డెత్ ఇన్ యంగ్ అడల్ట్స్: ఎ వన్-ఇయర్ అబ్జర్వేషనల్ స్టడీ ఎట్ ఎ టెర్షియరీ కేర్ సెంటర్ ఇన్ ఇండియా’’ అనే శీర్షికతో కూడిన ఈ అధ్యయనం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌కు చెందిన జర్నల్ ‘‘ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌’’లో పబ్లిష్ అయింది. ఈ అధ్యయనంలో. వెర్బల్ ఆటోప్సీ, పోస్ట్‌మార్టం ఇమేజింగ్, సంప్రదాయ ఆటోప్సీ, వివరణాత్మక హిస్టోపాథలాజికల్ పరీక్షలను ఉపయోగించి 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తుల ఆకస్మిక మరణ కేసులను పరిశోధకులు నిశితంగా పరిశీలించారు. ఈ అధ్యయనంలో కోవిడ్-19 టీకాకు, యువకులలో ఆకస్మిక మరణాలకు మధ్య సంబంధాన్ని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు ఏవీ కనుగొనబడలేదు. ఇటువంటి మరణాలకు అంతర్లీనంగా ఉన్న హృదయ సంబంధిత, ఇతర వైద్య కారణాలే కారణమని ఈ అధ్యయనం స్పష్టంగా చూపింది. ఎల్లప్పుడూ ఆధారాల-ఆధారిత పరిశోధనల ద్వారానే ప్రజలకు అవగాహన కల్పించాలని ఎయిమ్స్- ఢిల్లీకి చెందిన డా. సుధీర్ అరవ తెలిపారు.