
సాక్షి డిజిటల్ న్యూస్; కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన 8వ పే కమిషన్ పనితీరు ప్రారంభించింది. అయితే ఈ పేకా మిషన్ అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు అందజేయడానికి కనీసం రెండు సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన కేంద్ర ప్రభుత్వం కనుక 2026 జనవరి ఒకటో తేదీ నుంచి ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులను పరిగణలోకి తీసుకున్నట్లయితే 8వ వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వచ్చేంతవరకు గడిచిపోయిన నెలలకు ఏరియర్స్ రూపంలో తిరిగి చెల్లింపులు లభిస్తాయా లేదా అనే సందేహం ఉద్యోగుల్లో నెలకొని ఉంది.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎనిమిదో పే కమిషన్ ఏర్పాటు చేసి ఇప్పటికే, అధికారికంగా కమిషన్ పనితీరును ప్రారంభించింది. ఈ కమిషన్ లో సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ , చైర్ పర్సన్ గా నియమించగా, ప్రొఫెసర్ పులక్ ఘోష్, పార్ట్-టైమ్ మెంబర్‌గా నియమించారు. శ్రీ పంకజ్ జైన్ , మెంబర్-సెక్రటరీగా నియమించారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (ToR) సైతం విడుదల చేసింది. అయితే ప్రస్తుతం ఎనిమిదవ వేతన సంఘం అమలు అలాగే బకాయిల చెల్లింపు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జనవరి ఒకటో తేదీ 2026 నుండి ఏరియాస్ చెల్లిస్తారా లేదా అనే దానిపైన తర్జన భర్జన పడుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం నేడు పార్లమెంటులో దీనిపై ప్రశ్నించగా నిధుల లభ్యతను బట్టి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.