
సాక్షి డిజిటల్ న్యూస్ : నక్సలిజం విషపూరిత పాము లాంటిదని, దానిని పెంచి పోషించడం అంటే మన ప్రాణాలకు హాని కలిగించుకోవడమే అని కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది కల్లా నక్సలిజాన్ని అంతం చేసి...దేశంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. నక్సలిజంపై కేంద్రహోంమంత్రి అమిత్ షా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సమాజంలో నక్సలిజం అనేది పాము లాంటిది అని అన్నారు. నక్సలిజం వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని చెప్పుకొచ్చారు. మావోయిస్టులుగా మారి ఆయుధాలను చేతపట్టిన వారికి గానీ మావోయిస్టులను ఎదుర్కొనే భద్రతా బలగాలకు కానీ నక్సలిజం వల్ల ప్రయోజనం లభించదని చెప్పుకొచ్చారు.ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లో ఉన్న ప్రియదర్శిని స్టేడియంలో శనివారం నిర్వహించిన 'బస్తర్ ఒలింపిక్స్ 2025' ముగింపు వేడుకల్లో హోం మంత్రి అమిత్‌షా ప్రసంగించారు. శాంతి మార్గం మాత్రమే దేశ అభివృద్ధికి బాటలు వేయగలదని చెప్పుకొచ్చారు. నక్సలిజం అనే విష సర్పమే బస్తర్ ప్రాంతంలో అభివృద్ధిని ఇన్నేళ్లుగా అడ్డుకుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నక్సలిజం అంతం కాగానే ఈ ప్రాంతంలో అభివృద్ధికి సంబంధించిన నూతన అధ్యాయం మొదలవుతుంది అని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాదికల్లా నక్సలిజాన్ని అంతం చేస్తాం నక్సలిజం ఎవరికీ ప్రయోజనం కలిగించదని... శాంతి మాత్రమే అభివృద్ధికి మార్గం చూపగలదని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. నక్సలిజం విషపూరిత పాము లాంటిదని, దానిని పెంచి పోషించడం అంటే మన ప్రాణాలకు హాని కలిగించుకోవడమే అని అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది కల్లా నక్సలిజాన్ని అంతం చేసి...దేశంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. ఆపరేషన్ కగార్‌లో భాగంగా ఇప్పటికే వందలాది మంది మావోయిస్టులు హతం అయ్యారని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పుకొచ్చారు. బస్తర్‌ను అభివృద్ధిని అడ్డుకుంది నక్సలిజం బస్తర్ అభివృద్ధిని అడ్డుకున్నది నక్సలిజం అని...ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ డివిజన్‌ను రాబోయే ఐదేళ్లలో దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన గిరిజన ప్రాంతంగా మార్చాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఉంది అని కేంద్రహోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ఇప్పటికీ మావోయిస్టుల్లోనే ఉన్నవారు ఇకనైనా జనజీవన స్రవంతిలోకి తిరిగి వచ్చేయాలని పిలుపునిచ్చారు. నక్సలిజాన్ని వదిలేసే వారికి మెరుగైన పునరావాస ప్యాకేజీలను అందిస్తున్నామన్నారు. మావోయిస్టుల రెడ్ టెర్రర్‌ను పూర్తిగా అంతం చేసేందుకు మోడీ సర్కారు నిర్దేశించుకున్న గడువు సమీపిస్తోందని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా గుర్తుచేశారు. మళ్లీ జగదల్‌పూర్ వచ్చేసరికి నక్సలిజం తుద ముట్టించి తీరుతాం ‘నేను 2024 సంవత్సరంలో జరిగిన బస్తర్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లోనూ పాల్గొన్నాను. మళ్లీ ఈరోజు వచ్చాను.2026లో జరగబోయే వేడుకలకు కూడా తప్పకుండా హాజరవుతాను అని నేను చెప్తున్నాను. 2026 - బస్తర్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల సమయానికి ఛత్తీస్‌గఢ్‌తో పాటు యావత్ భారతదేశంలో నక్సలిజాన్ని తుద ముట్టించి తీరుతాం.’అని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా హెచ్చరించారు. ‘బస్తర్ డివిజన్‌లోని గిరిజన జిల్లాలు కాంకేర్, కొండగావ్, బస్తర్, సుక్మా, బీజాపూర్, నారాయణ్‌పూర్, దంతెవాడలను అభివృద్ధి చేస్తాం. 2030 డిసెంబరుకల్లా ఈ జిల్లాలను దేశంలోనే అత్యంత వికసిత గిరిజన జిల్లాలుగా తీర్చిదిద్దుతాం. ఈ జిల్లాల్లోని ప్రజలకు ఇళ్లు, విద్యుత్, మరుగుదొడ్లు, నల్లా నీరు, ఎల్‌పీజీ కనెక్షన్, రోడ్లు, ప్రతి 5 కి.మీకు ఒక బ్యాంకు, ప్రాథమిక ఆస్పత్రులు, కమ్యూనిటీ ఆస్పత్రులు, ప్రతినెలా ఉచిత ఆహార ధాన్యాలు, ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఉచిత వైద్యం అందిస్తాం’ కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా వెల్లడించారు.