
సాక్షి డిజిటల్ న్యూస్: ద గోట్ ఇండియా టూర్‌లో భాగంగా ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీ శనివారం హైదరాబాద్‌లో పర్యటించారు. మెస్సీ పర్యటనకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్‌లో ఆసక్తికర పోస్టు చేశారు. ద గోట్ ఇండియా టూర్‌లో భాగంగా ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీ శనివారం హైదరాబాద్‌లో పర్యటించారు. మెస్సీ పర్యటనకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్‌లో ఆసక్తికర పోస్టు చేశారు. తమ ఆహ్వానాన్ని మన్నించి హైదరాబాద్ నగరాన్ని విచ్చేసి.. తమ క్రీడా ప్రియులకు ముఖ్యంగా యువతను ఉత్సాహపరిచినందుకు G.O.A.T లియోనెల్ మెస్సీకి, ఫుట్‌బాల్ దిగ్గజాలు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్‌లకు సీఎం రేవంత్ రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తమతో చేరి ఆ సాయంత్రాన్ని జీవితకాల జ్ఞాపకంగా మార్చినందుకు తమ నాయకుడు రాహుల్ గాంధీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టుగా చెప్పారు. తెలంగాణ అంటే క్రీడలు, తెలంగాణ అంటే ఎక్సలెన్స్, తెలంగాణ అంటే ఆతిథ్యం అని ప్రపంచానికి చాటిచెప్పడంలో కీలక పాత్ర పోషించిన నగరంలోని అందరూ అధికారులు, భద్రతా సిబ్బంది, నిర్వాహకులు, సిబ్బందికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేశారు. అలాగే క్రమశిక్షణతో వ్యవహరించినందుకు క్రీడా ప్రేమికులకు, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశారు. ‘‘క్రీడా ప్రపంచంలో తెలంగాణ ముద్ర... ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం G.O.A.T మెస్సీతో హైదరాబాద్ గడ్డపై సాధించిన అద్భుతమైన ఘనత. ప్రపంచ క్రీడా వేదికపై తెలంగాణ ప్రకాశించిన సందర్భం ఇది... భవిష్యత్తులో ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చే సామర్థ్యం తెలంగాణకు ఉందని చాటిచెప్పాం’’ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మెస్సీ పర్యటనకు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశారు. ఇక, శనివారం సాయంత్రం ఫుట్‌బాల్ దిగ్గజాలు రోడ్రిగో డి పాల్ (అర్జెంటీనా), లూయిస్ సువారెజ్ (ఉరుగ్వే) లతో కలిసి హైదరాబాద్ చేరుకున్న మెస్సీ... నగరంలోని ఉప్పల్ స్టేడియంలో అడుగుపెట్టినప్పటి నుంచి చివరి వరకు గ్యాలరీలో ఉన్న క్రీడాభిమానులకు అభివాదం చేస్తూ వారిలో జోష్ నింపారు. ప్రారంభంలో సింగరేణి ఆర్ఆర్ 9 టీమ్‌కు, అపర్ణ ఆల్ స్టార్స్ టీమ్‌కు మధ్యన సాగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌ను మెస్సీ ఆసక్తిగా తిలకించారు. ఉత్తేజంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆర్ఆర్-9 టీమ్ 4-0 గోల్స్‌తో విజయం సాధించింది. ఆర్ఆర్ టీమ్ తరఫున మధ్యలో చేరిన రేవంత్ రెడ్డి నాలుగో గోల్ సాధించినప్పుడు అభిమానులు పెద్ద ఎత్తున కేరింతలు కొట్టారు. అతిధిగా హాజరైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈ మ్యాచ్ జరుగుతున్నంత సేపు గ్యాలరీ నుంచి తిలకించారు.