ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ ఆలస్యంపై కీలక సమాచారం

జనం న్యూస్ : ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్‌ (ITR) రీఫండ్ ఆలస్యం కావడానికి గల కారణాలేంటి అనే విషయం తెలుసుకుందాం ! ఐటీఆర్ రీఫండ్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. కొద్దిమంది టాక్ పేయర్స్ ITR రిటర్న్స్ దాఖలు చేసిన తర్వాత, కన్ఫర్మ్ చేసిన వారు ఇన్‌కమ్ టాక్స్ రీఫండ్ పొందారు, మరికొందరు ఇంకా రీఫండ్ పొందాల్సి ఉంది.2025-26 అసెస్‌మెంట్ సంవత్సరం (FY 2024-25) సంబంధించి టాక్స్ పేయర్స్‌కు ఇంకా రీఫండ్ పొందలేరు. ఈ ఏడాది రిటర్నులు దాఖలు చేయడానికి గడువు సెప్టెంబర్ 16, 2025 తో ముగిసింది , చాలా వరకు రీఫండ్‌లు ప్రాసెస్ చేయబడినప్పటికీ, ఇంకా రీఫండ్ రాలేదు. సాధారణంగా ఇన్‌కమ్ టాక్స్ రీఫండ్ దాఖలు చేసిన తర్వాత ఇ-వెరిఫైడ్ తర్వాత నాలుగు నుండి ఐదు వారాలలోపు రీఫండ్‌లను క్రెడిట్ చేస్తుంది. అయితే వివిధ కారణాల వల్ల రీఫండ్ ఆలస్యం కావచ్చు. ఐటీఆర్ ఆలస్యం కావడానికి గల కారణాలు ఇవే! బ్యాంకింగ్ ఎర్రర్స్ కొన్ని సందర్భాల్లో ఆదాయపు పన్ను శాఖ రిటర్న్‌ను ప్రాసెస్ చేస్తుంది. కానీ టాక్స్ పేయర్స్ బ్యాంక్ వివరాలు సరైనవి లేకపోవడం వలన రీఫండ్ ఆలస్యమవుతుంది. గత సంవత్సరాల నుండి మీకు ఏవైనా టాక్స్ డిమాండ్ పెండింగ్‌లో ఉంటే, ఆ శాఖ మీ రిటర్న్స్‌ను పెండింగ్‌లో ఉంచే అవకాశం ఉంది. సాంకేతిక లోపాల వలన ఆలస్యం కావచ్చు ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో అనేక సాంకేతిక సమస్యల వలన సిస్టమ్ లోడ్, టెక్నికల్ ఎర్రర్స్ వలన ప్రాసెస్ ఏర్పడటం వలన రీఫండ్ ఆలస్యం కావచ్చు. ఐటీఆర్ దాఖలు చేయడంలో మిస్టేక్స్, చిన్న చిన్న మిస్టేక్స్ వలన కూడా రీఫండ్ ఆలస్యం కావచ్చు. కొన్ని టాక్స్ రీఫండ్స్ నేరుగా బ్యాంకు అకౌంట్లో క్రెడిట్ అవుతాయి, కాబట్టి బ్యాంకు అకౌంట్ చెక్ చేయడం మంచిది. బ్యాంకు వివరాలు తప్పుగా ఉంటే కూడా రీఫండ్ ఆలస్యం కావచ్చు. టాక్స్ పేయర్స్ బ్యాంకు వివరాలు వెరిఫై చేయకపోయినా, పాన్ వివరాలు మీ పేరుతో మ్యాచ్ కాకపోయినా రీఫండ్ ఆలస్యం కావచ్చు. మూలధన లాభాలు లేదా బిజినెస్ ద్వారా వచ్చిన ఆదాయం విషయంలో రీఫండ్ ప్రాసెస్‌లో జాప్యం ఏర్పడుతుంది. కొన్ని సందర్భాలలో ఆదాయపు పన్ను శాఖ వారు క్రాస్-వెరిఫికేషన్ చేసే అవకాశం ఉంది. నిపుణుల ప్రకారం, కొన్ని సందర్భాల్లో రీఫండ్ కేవలం వారం రోజుల్లోనే క్రెడిట్ అవుతుంది. ఐటీఆర్ రీఫండ్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే! ఇక్కడ మీ వివరాలను తెలుసుకోవచ్చు. మీరు దాఖలు చేసిన ITR లైఫ్ సైకిల్ కూడా చూడవచ్చు. ఇ-ఫైలింగ్ పోర్టల్ హోమ్‌పేజీకి వెళ్లండి. మీ యూజర్ ఐడి , పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి. ఇ-ఫైల్ ట్యాబ్ ఆదాయపు పన్ను రిటర్న్‌లు > ఫైల్ చేసిన రిటర్న్‌లను వీక్షించండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. మీరు ఇప్పుడు మీకు కావలసిన అసెస్‌మెంట్ సంవత్సరానికి రీఫండ్ స్టేటస్‌ను చెక్ చేసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *