విద్యారంగంలో సంస్కరణలకు శ్రీకారం

★ఐటీఐల ఆధునికీకరణపై మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు

సాక్షి డిజిటల్ న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి పాలనలో అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అనే లక్ష్యంతో ప్రభుత్వం పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం వెల్లడించారు. కాలానుగుణంగా మారుతున్న ప్రపంచ అవసరాలకు అనుగుణంగా విద్యావ్యవస్థలో సమూలమైన, విప్లవాత్మక మార్పులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.గడిచిన రెండు సంవత్సరాలుగా విద్యారంగాన్ని అత్యున్నత ప్రాధాన్యత అంశంగా గుర్తించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అనే లక్ష్యంతో ప్రభుత్వం పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.బ్రెయిన్ ఫీడ్ గ్రూప్ ఆధ్వర్యంలో హైటెక్స్‌లో నిర్వహించిన ET TECH X (ఈటీ టెక్ ఎక్స్) – 6వ ఎడిషన్ కార్యక్రమానికి శనివారం నాడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాలల మౌలిక సదుపాయాల అభివృద్ధి నుంచి ఉపాధ్యాయుల భర్తీ, డిజిటల్ లెర్నింగ్, స్కిల్ ఎడ్యుకేషన్ వరకు విద్యారంగంలోని ప్రతి దశలో సమగ్ర మార్పులు తీసుకు వస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణానికి రూ.21వేల కోట్లు ‘ఈ రోజుల్లో వేగంగా మారుతున్న విద్యా ప్రపంచంలో ET TECH X వంటి వేదికలు అత్యంత అవసరమని....టెక్నాలజీ–విద్య కలిసి భవిష్యత్తును ఎలా నిర్మించాలి అనే అంశంపై ఆలోచించేందుకు, చర్చించేందుకు ఇవి దిశానిర్దేశం చేస్తున్నాయి’అని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కుల, మత భేదాలకు అతీతంగా ఎస్సీ ,ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులందరూ ఒకే క్యాంపస్‌లో అన్ని సౌకర్యాలతో కలిసి చదువుకునేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.రాష్ట్రంలోని 105 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 105 యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.21,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ యంగ్ ఇండియా స్కూల్స్ ప్రతి పాఠశాలను 25 ఎకరాల విశాల ప్రాంగణంలో...అత్యాధునిక మౌలిక సదుపాయాలతో ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టితో 2024 డీఎస్సీ ద్వారా పది వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 2024 సెప్టెంబర్ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ సౌకర్యం అమలు చేస్తున్నామని...దీనికోసం ప్రభుత్వం సంవత్సరానికి సుమారు రూ.140 కోట్ల వ్యయాన్ని భరిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.