జనం న్యూస్: గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు కనిష్టానికి చేరుకుంటున్నాయి. పది డిగ్రీల కంటే తక్కువకు పడిపోతున్నాయి. దీంతో ప్రజలు చలితో వణికిపోతున్నారు. వీటికితోడు చలిగాలుల తీవ్రత మరింత ఎక్కువగా ఉండటంతో వణికిపోతున్నారు. ఈ చలి ప్రభావం చిన్నారులు, వృద్ధులపై తీవ్రంగా చూపుతోంది.తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది.ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.దీంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టాలంటేనే గజగజ వణికిపోతున్నారు.వీటికి తోడు చల్లటి గాలులు సైతం వీస్తున్నాయి. దీంతో పిల్లలు, వృద్దులు చలికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు 28 జిల్లాల్లో 10 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి ఉంటే ఉష్ణోగ్రతలు ఎంతలా పడిపోయాయో అర్థం చేసుకోవచ్చు.సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో అత్యల్పంగా 5.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. గత పదేళ్లలో ఇంత తక్కువ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే.అంతేకాదు డిసెంబర్ రెండో వారంలో ఎక్కువ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవడం కూడా ఇదే తొలిసారి అని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మరీ దారుణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు కనిష్టానికి చేరుకుంటున్నాయి. పది డిగ్రీల కంటే తక్కువకు పడిపోతున్నాయి. దీంతో ప్రజలు చలితో వణికిపోతున్నారు. వీటికితోడు చలిగాలుల తీవ్రత మరింత ఎక్కువగా ఉండటంతో వణికిపోతున్నారు. ఈ చలి ప్రభావం చిన్నారులు, వృద్ధులపై తీవ్రంగా చూపుతోంది.రహదారుల వెంబడి, పొలాల్లో, గ్రామాల్లో ప్రజలు చలిమంటలు వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. చర్మం పగుళ్లు బారడం, కళ్ల నుంచి నీళ్లు, తుమ్ముళ్లు, జలుబులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కమ్మేస్తున్న పొగమంచు. మరోవైపు ఉష్ణోగ్రతలు పడిపోవడంతోపాటు రహదారులపై మంచు దుప్పటి పరుచుకున్నట్లు తయారైంది. రాత్రి 8 గంటలు దాటితే చాలు మంచు కమ్మేస్తోంది. ఉదయం పూట రోడ్లపై మంచు కురుస్తుండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కూడా వాహనదారులకు కనిపించడం లేదు. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.