రాజకీయ కలహాలు తీవ్రం : ఈటల భవితవ్యంపై కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

జనం న్యూస్‌: మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ రాజకీయ జీవితం పతనం అయ్యింది అని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలు ఓడించడంతో ఆయన ఈ ప్రాంతాన్ని, ఈ మట్టిని వదిలేశారని ఆరోపించారు. ప్రజలు గత ఎన్నికల్లో తిరస్కరించినా. పంచాయతీ ఎన్నికల కోసం వచ్చి పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.మల్కాజ్‌గికి ఎంపీ,బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ ఏనాడైతే హుజూరాబాద్ వదిలిపారిపోయారో అప్పుడే ఆయన రాజకీయ పతనం మెుదలైంది అని అన్నారు. ‘బీసీ బిడ్డను. దళిత, బడుగు బిడ్డల పక్షాన పోరాడతా అని పదేపదే చెప్పుకునే ఈటల రాజేందర్ బీసీ బిడ్డ బాలరాజ్‌ని చంపించింది నిజం కాదా. బీసీ బిడ్డ ప్రవీణ్ యాదవ్ చావుకి కారణం నువ్వు కదా. బీసీల ఓట్ల కోసం రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారే తప్ప అసలు మీకు బీసీలతో ఉన్న అనుబంధమేముంది? అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓడిపోగానే ఈ మట్టిని. ఇక్కడ ప్రజలను ఈటల రాజేందర్ వదిలిపెట్టి వెళ్లిపోయాడని ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి మండిపడ్డారు. ఓడిపోతే హుజారాబాద్‌ను వదిలేస్తారా? ‘గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్‌తో పాటు గజ్వేల్‌లో ఎందుకు పోటీ చేసినట్లు? ఈ రెండు నియోజకవర్గాల్లో ఓడిపోగానే ఈ మట్టిని (హుజూరాబాద్) వదిలేసి మల్కాజ్‌గిరికి పారిపోయి ఎంపీగా ఎందుకు పోటీ చేసినట్లు? సొంత ఊరిపై, నియోజకవర్గంపై ప్రేమ ఉంటే గెలిచినా ఓడినా ఇక్కడే ఉంటూ ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ వారికి సేవ చేయడమే తమకు తెలుసు’అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వెల్లడించారు. ఈ మట్టిన పుట్టిన మాజీమంత్రి స్వర్గీయ ముద్దసాని దామోదర్ రెడ్డి గెలిచినా ఓడినా ఇక్కడి ప్రజల కోసమే సేవ చేస్తూ తుది శ్వాస విడిచారు అని చెప్పుకొచ్చారు. ‘నేను 2018లో ఎమ్మెల్యే గా గతంలో పోటీ చేసి ఓడిపోయినా ఏనాడూ హుజూరాబాద్‌ను విడిచిపోలేదు. పోరాటాలు చేస్తూ ప్రజలతో మమేకమై ఎమ్మెల్యేగా గెలిచి సేవ చేస్తున్నా. కానీ మీరు ఒక్కసారి ఓడిపోతేనే హుజూరాబాద్ ప్రజలనే తప్పు పడుతూ వాళ్ల భవిష్యత్తును గాలికొదిలేశారు. మీ రాజకీయ స్వార్ధం, మీ కుటుంబ వ్యాపారాలను, ఆస్తులను కాపాడుకునేందుకు మల్కాజ్ గిరి పారిపోయి ఎంపీగా పోటీ చేశారు. పుట్టిన గడ్డపై మమకారం అంటే ఇదేనా రాజేందర్’అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిలదీశారు. హుజూరాబాద్‌ను మీరెలా అభివృద్ధి చేస్తారు? ‘ఈ పంచాయతీ ఎన్నికల్లో మీరు నిలబెట్టిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలను అభివృద్ధి చేస్తానని పదేపదే ప్రచారం చేస్తున్న మిమ్ముల్ని సూటిగా అడగదల్చుకున్నా. మీరు ఇక్కడి ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు. ఇక్కడ ఖర్చు పెట్టడానికి మీకు ప్రత్యేకంగా ఎలాంటి నిధులు రావు. మీ పార్టీ రాష్ట్రంలో కూడా అధికారంలో లేదు. మరి పైసలు ఎక్కడి నుండి తెచ్చి అభివృద్ధి చేస్తారు? అని నిలదీశారు. ‘నేను ఈ ప్రాంత ఎమ్మెల్యే గా ఉన్నా కాబట్టి నిధుల కోసం రాష్ట్రంపై పోరాడి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాను. కాబట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఈ గ్రామాలను అభివృద్ధి చేసే అవకాశం ఉంది. గత 10పది సంవత్సరాల అభివృద్ధి కేసీఆర్ సహకారంతో ప్రత్యేక నిధులు తీసుకొచ్చి గ్రామాల అభివృద్ధి చేశాం ఇక్కడ ఏ పదవిలో లేని మీరు గ్రామాలను అభివృద్ధి చేస్తానంటే నమ్మడానికి ప్రజలు ఏమైనా అమాయకులని అనుకుంటున్నారా? మీ రాజకీయ అభివృద్ధి కోసం ఈ గడ్డను వాడుకుంటున్నావే తప్ప మీ సర్పంచులను గెలిపిస్తే ఈ గ్రామాల అభివృద్ధికి శాపంగా మారతారనే విషయం ప్రజలకు తెలియదనుకుంటున్నారా? మీరు అభ్యర్థులను నిలబెట్టి పోటీ చేయిస్తోంది మీ రాజకీయ అభివృద్ది కోసమే తప్ప ఇక్కడి గ్రామాల అభివృద్ధి కోసం కాదనే విషయం తెలియదనుకుంటున్నారా?’అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిలదీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *