త్వరలో మోదీ నెతన్యాహు సమావేశం!

* త్వరలో మోదీ-నెతన్యాహు సమావేశం! ఇజ్రాయెల్ పీఎంఓ అధికారిక ప్రకటన

పయనించే సూర్యుడు న్యూస్ : భారత్, ఇజ్రాయెల్ మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు త్వరలోనే భారత పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం నెతన్యాహు.. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్ ద్వారా ఆత్మీయ సంభాషణ జరిపారు. ఈ చర్చల అనంతరం ఇరు నేతలు “త్వరలో సమావేశం కావాలని అంగీకరించినట్లు” ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ధృవీకరించింది. ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం (BIT), స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) వంటి కీలక వాణిజ్య ఒప్పందాలపై ఇరు దేశాల మంత్రులు ఇప్పటికే పర్యటనలు జరిపి పురోగతి సాధించిన నేపథ్యంలో.. ఈ శిఖరాగ్ర సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  భారత్-ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు త్వరలో భారత పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీతో టెలిఫోన్‌లో సంభాషించారు. ఈ ఇద్దరు అగ్రనేతలు “త్వరలో సమావేశం కావాలని అంగీకరించినట్లు” ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం (PMO) సోషల్ మీడియా పోస్టులో అధికారికంగా వెల్లడించింది. భారత భద్రతా వ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. నెతన్యాహు పర్యటనకు ముందు.. ఇరు దేశాల మధ్య పలువురు మంత్రుల అత్యున్నత స్థాయి పర్యటనలు జరిగాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఇజ్రాయెల్ పర్యాటక శాఖ మంత్రి హైమ్ కాట్జ్, ఆర్థిక శాఖ మంత్రి నిర్‌ బర్కట్, వ్యవసాయ శాఖ మంత్రి అవి డిచ్టర్, ఆర్థిక శాఖ మంత్రి బెజాలెల్ స్మోట్రిచ్ భారతదేశాన్ని సందర్శించారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు, ముఖ్యంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదిర్చేందుకు ఇరు దేశాలు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఆర్థిక మంత్రి స్మోట్రిచ్ పర్యటన సందర్భంగా ఇరు దేశాలు ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం (BIT) పై సంతకాలు చేశాయి. గత నెలలో భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ ఇజ్రాయెల్‌ను సందర్శించినప్పుడు.. FTAకు దారితీసే విధంగా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ (TOR) పై కూడా అంగీకారం కుదిరింది. ఈ ఒప్పందాలన్నీ ఇరు దేశాల మధ్య వాణిజ్య, రక్షణ, సాంకేతిక సహకారాన్ని మరింత విస్తృతం చేస్తాయి. ఈ నేపథ్యంలోనే త్వరలో జరగబోయే మోదీ-నెతన్యాహు భేటీ ఇరు దేశాల వ్యూహాత్మక సంబంధాలలో మరింత వేగాన్ని పెంచే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *