సాక్షి డిజిటల్ న్యూస్: తెలుగుదేశం పార్టీ పార్టీ సిద్దాంతాలను… భావజలాన్ని ప్రతి కార్యకర్త తెలుసుకోవాలని అధినేత సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. మహిళల ఓటు బ్యాంక్ మెజార్టీ మనకే వచ్చేలా చూడడంలో కార్యకర్తలదే బాధ్యత. సమన్వయంతో పని చేయాలి… క్రమశిక్షణతో మెలగాలి’ అని సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. డబ్బుతోనే ఎన్నికలను గెలవగలమని కొందరు భావిస్తారు… కానీ మనం చేసే మంచి పనుల్ని ప్రజలకు నిత్యం వివరిస్తే గెలవగలం. పని చేయడం ఒక ఎత్తు…చేసిన పని ప్రజల్లోకి తీసుకెళ్లడం మరొక ఎత్తు’అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. కాఫీ కబుర్లు పేరుతో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో కార్యకర్తలతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ‘ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో సీఎం చంద్రబాబునాయుడు కాఫీ కబుర్లు చెప్పారు. శిక్షణ కార్యక్రమాలు ఎలా జరిగాయని సీఎం చంద్రబాబు నాయుడు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ హయాంలో జరిగిన శిక్షణ కార్యక్రమాలను సీఎం చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకున్నారు. నాడు చెట్ల కింద ఎర్రటి ఎండలో శిక్షణ కార్యక్రమాలు చేపట్టేవాళ్లమని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ఇప్పుడు చల్లటి ఏసీ గదుల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్న చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రతీ కార్యకర్తకు తెలియాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నాయకులు కూడా తమ నాయకత్వాలను మెరుగు పరుచుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. పార్టీ సిద్దాంతాలను… భావజలాన్ని ప్రతి కార్యకర్త తెలియాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే నేతలు, కార్యకర్తలను కలిసేందుకు వినూత్న కార్యక్రమాలు చేడతున్నాం అని చెప్పుకొచ్చారు. ‘గతంలో టెక్నాలజీ ఉండేది కాదు… ఇప్పుడు చాలా పీక్ కు వెళ్లింది. అన్నదాత సుఖీభవ, దీపం-2.0, స్త్రీశక్తి పథకం, తల్లికి వందనం పథకాలు అమలు చేస్తున్నాం’అని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ‘మహిళల ఓటు బ్యాంక్ మెజార్టీ మనకే వచ్చేలా చూడడంలో కార్యకర్తలదే బాధ్యత. సమన్వయంతో పని చేయాలి… క్రమశిక్షణతో మెలగాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ప్రతీ బూత్ బలోపేతం కావాలి ‘ప్రతి పోలింగ్ బూత్‌లో బలాబలాలు చూసుకోవాలి… ప్రతి బూత్ బలోపేతం కావాలి. ఎక్కడ సమర్థవంతమైన నాయకత్వం ఉంటే అక్కడ ఎక్కువ ఓట్లు వస్తాయి. బలహీన నియోజకవర్గానికి మంచి నేత ఉంటే… నియోజకవర్గం బలపడుతుంది’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.‘బలహీన నేతకు మంచి నియోజకవర్గం ఇచ్చినా పార్టీని బలహీన పరుస్తారు. 2019 నుంచి 2024 వరకు విధ్వంసం జరిగి వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి. వాటిని సరిచేసి గాడిన పెట్టాం. ప్రతిపక్షంలో ఎంత పట్టుదలతో పని చేశారో… ఇప్పుడూ అంతకు మించిన స్థాయిలో పని చేయాలి. ఏడాదికి రూ.33 వేల కోట్లు పింఛన్లకు ఇస్తున్నాం’అని సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.