అనంతపురం టెన్షన్ : ఒక్క సారిగా నాలుగు విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం!

జనం న్యూస్‌: అనంతపురం జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నలుగురు బాలికలు ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.అనంతపురం జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నలుగురు బాలికలు ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాలు. జిల్లాలోని కేఎస్‌ఆర్ జూనియర్ కాలేజ్‌ ప్రాంగణంలో నలుగురు విద్యార్థినులు ఆత్మహత్యకు యత్నించారు. వారు హెయిర్‌డై రసాయనం తాగి ఆత్మహత్యకు యత్నించినట్టుగా చెబుతున్నారు. ఈ విషయం గమనించిన వార్డెన్ వెంటనే వారిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలికల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఆత్మహత్యకు యత్నించిన నలుగురు విద్యార్థినులలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు. ఈ విద్యార్థులు సరిగా చదవట్లేదని తల్లిదండ్రులకు హాస్టల్ వార్డెన్‌ ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు వారిని మందలించినట్టుగా సమాచారం. దీనితో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థినులు హేయిర్ డై రసాయనాన్ని సేవించి ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే గమనించిన కళాశాల సిబ్బంది హుటాహుటిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన కళాశాలలో కలకలం సృష్టించింది. ప్రస్తుతం ఆ నలుగురు విద్యార్థినులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. చదువుల ఒత్తిడి కారణంగానే వారు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారని తోటి విద్యార్థులు, స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏ సమస్యకు కూడా ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు. మీరు ఒత్తిడికి లోనవుతున్నట్లు, ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా ఆలోచనలువస్తే. దయచేసి వెంటనే సహాయం తీసుకోండి. మీ ప్రాంతంలోని మానసిక ఆరోగ్య నిపుణుడిని, కౌన్సెలర్‌ను లేదా సపోర్ట్ హాట్‌లైన్‌ను సంప్రదించండి. మీరు ఒంటరి కాదు. సహాయం మీకు అందుబాటులో ఉంది. అటువంటి ఆలోచనల నుంచి బయటపడేందుకు హెల్ప్‌లైన్ నంబర్లు. ఆస్రా 9820466726, స్నేహి 9582208181, ఫోర్టిస్ మెంటల్‌హెల్త్ 8376804102 నెంబర్లను సంప్రదించండి.