సూడో సెక్యులరిజం పేరుతో న్యాయవ్యవస్థను బెదిరిస్తారా?

★ పవన్ కల్యాణ్ సంచలన ప్రశ్న!

సాక్షి డిజిటల్ న్యూస్: ఇండి కూటమిలోని పార్టీలపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సూడో సెక్యులరిజం పేరుతో న్యాయవ్యవస్థను బెదిరిస్తారా? అని ప్రశ్నించారు. ఇండి కూటమిలోని పార్టీలపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సూడో సెక్యులరిజం పేరుతో న్యాయవ్యవస్థను బెదిరిస్తారా? అని ప్రశ్నించారు. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జీఆర్ స్వామినాథన్‌ను తొలగించాలని కోరుతూ డీఎంకె నాయకురాలు కనిమొళి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అభిశంసన నోటీసును సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా హాజరయ్యారు. ఈ నోటీసుపై 120 మంది ఎంపీలు సంతకాలు చేశారు. అయితే ఈ పరిణామాలపై పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. గతంలో శబరిమల అంశంపై శతాబ్దాలుగా కొనసాగుతున్న ఒక పవిత్రమైన ఆచారాన్ని రద్దు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే, ఆ న్యాయమూర్తులను తొలగించాలని రాజకీయంగా ఒత్తిడి చేయలేదని అన్నారు. అయితే ఇప్పుడు మాత్రం విపక్షాలు... హిందూ మతానికి చెందిన స్థలంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న కార్తీక దీపం వెలిగించే ఆచారాన్ని కొనసాగించేందుకు భక్తుల హక్కును సమర్థిస్తూ తీర్పు ఇచ్చినందుకు ఒక విధుల్లో ఉన్న హైకోర్టు న్యాయమూర్తినే లక్ష్యంగా చేసుకున్నాయని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ‘‘రాజ్యాంగబద్ధమైన సుప్రీం కోర్టు ధర్మాసనం శబరిమల అంశంపై శతాబ్దాలుగా కొనసాగుతున్న ఒక పవిత్రమైన ఆచారాన్ని రద్దు చేస్తూ తీర్పు ఇస్తే... దేశవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున నిరసనలను తెలిపారు. కానీ ఎవరూ కూడా తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులపై అభిశంసన తీర్మానం చేయలేదు. అత్యంత పవిత్రమైన హిందూ క్షేత్రాల్లో ఒకటైన శబరిమలలోని ప్రధాన ఆచార మార్పు అంశంపై ఇచ్చిన తీర్పుపై కేవలం రివ్యూ పిటిషన్‌లు మాత్రమే దాఖలయ్యాయి... రాజకీయంగా వారిని (న్యాయమూర్తులను) తొలగించాలని ఒత్తిడి చేయలేదు.