సాక్షి డిజిటల్ న్యూస్: సీఎం చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలోని మంత్రులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలా మంది మంత్రులకు తమ శాఖల్లో ఏం జరుగుతుందో తెలియడంలేదన్నారు. కేంద్ర నిధులు తేవడం, వినియోగంలో మంత్రులు విఫలమయ్యారన్నారు. మంత్రులు ఒక్కరోజు ఢిల్లీకి వెళ్లడంలో నష్టం లేదు. ఇకనైనా మంత్రులు పనితీరు మార్చుకోవాలి అని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్రంలోని మంత్రుల పనితీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని శాఖల హెడ్స్ ఆఫ్ డిపార్ట్‌మెంట్స్ , సెక్రటరీలతో జరిగిన సమావేశంలో మంత్రుల తీరుపై సమీక్షించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలలు అయిందని… అయినప్పటికీ కొందరు మంత్రుల పనితీరులో మార్పులేదని అన్నారు.కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల నిధులు తీసుకురావడంలో కూడా మంత్రులు విఫలమవుతున్నారని విమర్శించారు. ఢిల్లీకి అధికారులతో కలిసి వెళ్లి సంబంధిత శాఖల కేంద్రమంత్రులను కలిసి పథకాలకు నిధులు తీసుకురండి అని సూచించారు. రాష్ట్రానికి సంబంధించిన నిధులు రాబట్టడం కోసం మంత్రులు ఒక్క రోజు ఢిల్లీకి వెళ్తే వచ్చే నష్టం ఏమీ లేదు కదా అని సీఎం ప్రశ్నించారు. పద్దెనిమిది నెలలు పూర్తి చేసుకుంటున్నామని ఇకనైనా మంత్రులు తమ పనితీరులో మార్పు తెచ్చుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. కేంద్రపథకాల నిధులను సద్వినియోగం చేసుకోండి: కొందరు మంత్రులు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో జాప్యం చేస్తున్నారని అది ప్రభుత్వ పనితీరును దెబ్బతీస్తోంది అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. పలు సమీక్షలలో మార్పు కోసం పలు సూచనలు చేసినప్పటికీ కొందరు మంత్రులలో ఎలాంటి మార్పులు రావడం లేదని అన్నారు. కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ప్రజలు మనకు ఓటు వేశారని… ఆ నమ్మకాన్ని కాపాడుకోవాలంటే మంత్రులు దూకుడుగా పని చేయాల్సిన అవసరం ఉంది అని సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.PM Awas Yojana, Ayushman Bharat, PMAY Urban వంటి కేంద్రపథకాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా మంత్రులు చొరవ చూపాలనిసీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. మంత్రులు పల్లె నిద్ర చేయాలి: ఇకపై మంత్రులు, ఎమ్మెల్యేలు నెలలో 4 రోజులు పల్లెల్లో పల్లె నిద్ర చేయాలి అని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. గ్రామాల్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి అని సూచించారు. పల్లె వెలుగు, స్వర్ణ గ్రామం పేరుతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్రంలోని మంత్రుల పనితీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని శాఖల హెడ్స్ ఆఫ్ డిపార్ట్‌మెంట్స్ , సెక్రటరీలతో జరిగిన సమావేశంలో మంత్రుల తీరుపై సమీక్షించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలలు అయిందని… అయినప్పటికీ కొందరు మంత్రుల పనితీరులో మార్పులేదని అన్నారు.కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల నిధులు తీసుకురావడంలో కూడా మంత్రులు విఫలమవుతున్నారని విమర్శించారు. ఢిల్లీకి అధికారులతో కలిసి వెళ్లి సంబంధిత శాఖల కేంద్రమంత్రులను కలిసి పథకాలకు నిధులు తీసుకురండి అని సూచించారు. రాష్ట్రానికి సంబంధించిన నిధులు రాబట్టడం కోసం మంత్రులు ఒక్క రోజు ఢిల్లీకి వెళ్తే వచ్చే నష్టం ఏమీ లేదు కదా అని సీఎం ప్రశ్నించారు. పద్దెనిమిది నెలలు పూర్తి చేసుకుంటున్నామని ఇకనైనా మంత్రులు తమ పనితీరులో మార్పు తెచ్చుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. కేంద్రపథకాల నిధులను సద్వినియోగం చేసుకోండి: కొందరు మంత్రులు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో జాప్యం చేస్తున్నారని అది ప్రభుత్వ పనితీరును దెబ్బతీస్తోంది అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. పలు సమీక్షలలో మార్పు కోసం పలు సూచనలు చేసినప్పటికీ కొందరు మంత్రులలో ఎలాంటి మార్పులు రావడం లేదని అన్నారు. కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ప్రజలు మనకు ఓటు వేశారని… ఆ నమ్మకాన్ని కాపాడుకోవాలంటే మంత్రులు దూకుడుగా పని చేయాల్సిన అవసరం ఉంది అని సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.PM Awas Yojana, Ayushman Bharat, PMAY Urban వంటి కేంద్రపథకాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా మంత్రులు చొరవ చూపాలనిసీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. మంత్రులు పల్లె నిద్ర చేయాలి: ఇకపై మంత్రులు, ఎమ్మెల్యేలు నెలలో 4 రోజులు పల్లెల్లో పల్లె నిద్ర చేయాలి అని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. గ్రామాల్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి అని సూచించారు. పల్లె వెలుగు, స్వర్ణ గ్రామం పేరుతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు.