ఫ్యూచర్ సిటీ అభివృద్ధి వేగం అందుకుంటోంది

* యువతకు ఆశాకిరణం ఫ్యూచర్ సిటీలో లక్షల ఉద్యోగాల దారితీసే మెగా పెట్టుబడులు

పయనించే సూర్యుడు న్యూస్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసగా డజన్ల కొద్దీ సమావేశాలు, చర్చలు నిర్వహిస్తూ, కొత్త ప్రాజెక్టులకు ఆహ్వానం పలికారు. ఆయన సమక్షంలో ఒక్క రోజులోనే అనేక సంస్థలు కీలక ఒప్పందాలు కుదుర్చుకోవడంతో, రాష్ట్రానికి భారీ పెట్టుబడులు చేరాయి. హైదరాబాద్‌ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక రైజింగ్ గ్లోబల్ సమిట్ రెండో రోజు పెట్టుబడిదారుల సందడితో మరింత హుషారుగా మారింది. హైదరాబాద్ భవిష్యత్ పరిశ్రమల కేంద్రంగా మారుతున్న వేళ, దేశ.. విదేశాల నుంచి వచ్చిన ప్రముఖ కంపెనీలు తెలంగాణలో వ్యాపార విస్తరణకు భారీ ఆసక్తి చూపాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసగా డజన్ల కొద్దీ సమావేశాలు, చర్చలు నిర్వహిస్తూ, కొత్త ప్రాజెక్టులకు ఆహ్వానం పలికారు. ఆయన సమక్షంలో ఒక్క రోజులోనే అనేక సంస్థలు కీలక ఒప్పందాలు కుదుర్చుకోవడంతో, రాష్ట్రానికి భారీ పెట్టుబడులు చేరాయి. రోజంతా జరిగిన చర్చల్లో ముఖ్యంగా ఆహార ప్రాసెసింగ్‌, FMCG, టెక్నాలజీ, ఫార్మా, బయోటెక్, డేటా సెంటర్లు, క్లీన్ ఎనర్జీ రంగాలపై కంపెనీలు విశేష ఆసక్తి కనబరిచాయి. నగరంలో జరుగుతున్న సమిట్‌ వాతావరణం చూస్తే, తెలంగాణ వ్యాపార పెట్టుబడుల ప్రపంచ పటంలో ముఖ్య కేంద్రంగా మారిందనే అభిప్రాయం సర్వత్రా వినిపించింది. గోద్రేజ్ ఇండస్ట్రీస్, తెలంగాణలో డైరీ పరిశ్రమ విస్తరణకు ముందుకు రావడం ముఖ్య అంశంగా నిలిచింది. రోజుకు ఐదు లక్షల లీటర్ల పాల ప్రాసెసింగ్ సామర్థ్యంతో భారీ ప్రాజెక్టుకు రూ.150 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. ప్రజలకు నాణ్యమైన పాలు , పాల ఉత్పత్తులు అందించడంతో పాటు, వందలాది ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉండటంతో ఈ ఒప్పందం ప్రత్యేక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఫుడ్ టెక్నాలజీలో నూతనతను తీసుకొచ్చే Fertis India కూడా పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. అరుదైన షుగర్ల తయారీ నుండి గ్లోబల్ ఆరోగ్య ఆహార రంగానికి అవసరమైన ప్రత్యేక న్యూట్రియంట్ల తయారీ వరకు, అత్యాధునిక R&D సెంటర్ ను తెలంగాణలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనివల్ల రాష్ట్రం ఆరోగ్య ఆహార పరిశ్రమలో కొత్త మార్కెట్లను అందుకునే అవకాశాలు మెరుగుపడనున్నాయి. ప్రపంచ స్థాయి FMCG కంపెనీలకు కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ చేసే KJS ఇండియా, తమ రెండో ప్లాంట్‌ నిర్మాణానికి ముందుకు రావడం, అలాగే ప్రసిద్ధ Vintage Coffee సంస్థ ఎగుమతుల కోసం అత్యాధునిక ఫ్రీజ్ డ్రైడ్ కాఫీ ప్లాంట్ ఏర్పాటు చేయడం ఆహార & పానీయాల పరిశ్రమలో తెలంగాణ స్థానం మరింత బలోపేతం చేసింది. ఈ సమిట్‌లో అత్యంత చర్చనీయాంశంగా నిలిచింది డేటా సెంటర్ పెట్టుబడులు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న డిజిటలైజేషన్ నేపథ్యంలో, ప్రపంచ టెక్ సంస్థలు తెలంగాణను తమ డేటా స్టోరేజ్ హబ్‌గా చూడడం, భారీ పెట్టుబడులకు దారితీసింది. JCK ఇన్‌ఫ్రా, AGP గ్రూప్, ఇన్‌ఫ్రా కీ DC పార్క్స్ వంటి సంస్థలు వేర్వేరు దశల్లో వేల కోట్ల పెట్టుబడులతో హైపర్‌స్కేల్ క్యాంపస్‌లు, నెట్ జీరో డేటా సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించాయి. ఇవి రాష్ట్రానికి వేలాది ఉద్యోగాలను అందించడమే కాకుండా, తెలంగాణను ఆసియా ఖండంలో అతిపెద్ద డేటా సెంటర్ హబ్‌గా నిలపగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఫార్మా రంగంలో ప్రముఖమైన హెటీరో భారీ స్థాయిలో కొత్త ఫార్ములేషన్ యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రకటించడం, బయోటెక్ రంగానికి అధునాతన పరిశోధన, తయారీ వ్యవస్థలను అందించేందుకు భారత్ బయోటెక్ సిద్ధమవ్వడం కూడా ఈ సమిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సమిట్ రెండో రోజు ముగిసే సమయానికి మొత్తం పెట్టుబడులు రూ.1,04,350 కోట్లు దాటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *