కేంద్రంపై మూడు ప్రశ్నలు సంధించిన రాహుల్‌ గాంధీ

*ఓట్ల చోరీ ఆరోపణలు.

సాక్షి డిజిటల్ న్యూస్: కేంద్రంలోని మోదీ సర్కార్ ఓట్ చోరీకి పాల్పడుతుందని ఆరోపణలు చేస్తున్న రాహుల్ గాంధీ తాజాగా ఇదే అంశంపై మంగళవారం (డిసెంబర్‌ 9) రోజున లోక్‌సభలో మాట్లాడారు. కేంద్రంలోని మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శల దాడిని పెంచారు. మోదీ సర్కార్ ఓట్ చోరీకి పాల్పడుతుందని ఆరోపణలు చేస్తున్న రాహుల్ గాంధీ తాజాగా ఇదే అంశంపై మంగళవారం (డిసెంబర్‌ 9) రోజున లోక్‌సభలో మాట్లాడారు. ఈ క్రమంలోనే తన ‘ఓటు-చోరీ’ ఆరోపణను పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా ఎన్నికలను గెలిచేందుకు భారత ఎన్నికల సంఘంతో బీజేపీ కుమ్మక్కై ఓట్ల చోరీ చేస్తోందని రాహుల్ గాంధీ మరోసారి ఆరోపించారు. ప్రధానమంత్రి, హోంమంత్రి‌లు చట్టాన్ని మార్చడం ద్వారా ఎన్నికల కమిషనర్లకు రక్షణను (ఇమ్యూనిటీని) ఎందుకు బహుమతిగా ఇచ్చారని… సీసీటీవీ ఫుటేజీకి సంబంధించిన నిబంధనలను ఎందుకు మార్చారని రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రశ్నించారు. ఎన్నికలను రూపొందించడానికి అధికారంలో ఉన్న వారితో ఎన్నికల కమిషన్ ఎలా కుట్రలు పన్నుతుందో తగినంత ఆధారాలను తాము చూపించామని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. ఓటుచోరీ ఆరోపణపై మీడియా ముందు తాను పలుసార్లు ప్రసంగించానని చెప్పారు. బీజేపీ భారత ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడానికి ఎన్నికల కమిషన్‌ను వాడుకుంటోందని ఆరోపించిన రాహుల్ మూడు ప్రశ్నలను లేవనెత్తారు. >> ఎన్నికల కమిషనర్ల ఎంపిక ప్యానెల్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని (సీజేఐ) ఎందుకు తొలగించారు?. ఎంపిక కమిటీలో ఒకవైపు ప్రధాని మోదీ, అమిత్ షా ఉంటే… మరోవైపు ప్రతిపక్ష నాయకుడికి అవకాశం కల్పించారు. అటువంటి చోట తనకు ఎటువంటి స్వరం లేదు. ఎందుకంటే వారు నిర్ణయించిందే జరుగుతుంది. అసలు ఎన్నికల కమిషనర్ ఎవరు ఉండాలనే విషయంలో ప్రధాని, అమిత్ షా ఎందుకు అంత ఆసక్తి చూపిస్తున్నారు? రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. దేశంలోని వ్యవస్థలను ఆర్ఎస్‌ఎస్ స్వాధీనం చేసుకుంటోందని ఆరోపించారు. దేశ సంస్థాగత చట్రాన్ని స్వాధీనం చేసుకోవడమే ఆర్ఎస్‌ఎస్ ప్రాజెక్ట్ అని ఆరోపణలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *