వందేమాతరం బ్రిటీషర్లకు సింహస్వప్నం

★...ఆజాద్ భారత్‌కు విజన్: పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్రమోడీ

సాక్షి డిజిటల్ న్యూస్ : వందేమాతరం కేవలం రాజకీయ స్వేచ్ఛ కోసం జపించిన మంత్రం కాదని భరత మాతను వలసవాద అవశేషాల నుంచి విముక్తి చేయడానికి రూపొందించిన పవిత్ర యుద్ధ నినాదం అని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. వందేమాతర నినాదం బ్రిటిషర్లకు సింహస్వప్నంగా మారింది అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. భారత్ నలువైపులా వందేమాతర నినాదం మారుమోగింది. మాతృభూమి దాస్య శృంఖలాలు తెంచేందుకు కీలకంగా మారింది అని కొనియాడారు. అంతేకాదు వందేమాతరం ఆజాద్ భారత్‌కు విజన్‌గా మారింది అని స్పష్టం చేశారు.లోక్‌సభలో జాతీయ గీతం వందేమాతరం 150వ వార్షికోత్సవంపై ప్రత్యేక చర్చ జరిగింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు చర్చను ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు.ఇకపోతే వందేమాతరంపై ప్రత్యేక చర్చ కోసం 10 గంటలు సమయం కేటాయించిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా పీఎం నరేంద్రమోడీ లోక్‌సభలో ప్రసంగించారు. ఈ చర్చ రాబోయే తరాల స్ఫూర్తిగా ఉపయోగపడుతుంది అని చెప్పుకొచ్చారు. వందేమాతరం వంటి ఒక పవిత్రమైన గీతాన్నిస్మరించుకోవడం ఒక గొప్పవరం అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకోవడం... మనమంతా ఈ చారిత్రాత్మక సందర్భాన్ని చూస్తుండటం ఎంతో గర్వకారణం అని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. స్వాతంత్య్రోద్యమానికి శక్తిగా వందేమాతరం: వందేమాతరం కేవలం రాజకీయ స్వేచ్ఛ కోసం జపించిన మంత్రం కాదని భరత మాతను వలసవాద అవశేషాల నుంచి విముక్తి చేయడానికి రూపొందించిన పవిత్ర యుద్ధ నినాదం అని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. కష్టసమయంలో ప్రజలకు దారిదీపంగా వందేమాతరం నిలిచింది.వందేమాతరం గేయం శత్రువుల చెవుల్లో మారుమోగింది అని ప్రధాని నరేంద్రమోడీ కొనియాడారు.దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి శక్తిని, ప్రేరణను ఇచ్చిన నినాదం వందేమాతరం అని ప్రశంసించారు. త్యాగం మరియు తపస్సు మార్గాన్ని చూపించింది వందేమాతరం అని కొనియాడారు. వందేమాతరం రచించినప్పుడు బ్రిటీష్ ప్రభుత్వ ఆంక్షలు వందేమాతరం రచించిన సమయంలో బ్రిటీష్ ప్రభుత్వం అనేక ఆంక్షలకు తెరలేపింది అని గుర్తు చేశారు. భారతదేశంలోని ప్రతీ ఇంట్లో బ్రిటిష్‌ జాతీయ గీతమైన గాడ్‌ సేవ్‌ ద క్వీన్‌ను ఆలపించేలా చేయాలని ఒత్తిడి తీసుకువచ్చారన్నారు. 1857 తర్వాత స్వాతంత్ర్య సమరయోధులపై ఒత్తిడి పెంచారు. ఒత్తిడి పెరిగినా వెనక్కి తగ్గకుండా వందేమాతరం రచించారు. వందేమాతరం వల్ల భారతదేశంలో ఎక్కువ కాలం జీవించడం కష్టమవుతోందని బ్రిటిష్ వారు భావించారని అందుకే విభజించి పాలించు మార్గాన్ని ఎంచుకున్నారు అని చెప్పుకొచ్చారు. ఇకపోతే వందేమాతరానికి 50 ఏళ్లప్పుడు భారతదేశం బ్రిటీష్ పాలనలోనే ఉందని చెప్పుకొచ్చారు. అయితే వందేమాతరం 100 ఏళ్లుపూర్తి చేసుకున్నప్పుడు దేశం ఎమర్జెన్సీలో ఉంది అని ప్రధాని నరేంద్రమోడీ చెప్పుకొచ్చారు.