సాక్షి డిజిటల్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారు. అయితే ఈ పర్యటనలో తనకు ఎదురైన ఓ ఆసక్తికర సంఘటనను అక్కడివారితో పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారు. అయితే ఈ పర్యటనలో తనకు ఎదురైన ఓ ఆసక్తికర సంఘటనను అక్కడివారితో పంచుకున్నారు. వివరాలు… ఏపీకి పెట్టుబడుల సేకరణలో భాగంగా మంత్రి నారా లోకేష్ నాలుగు రోజుల అమెరికా, కెనడా పర్యటకు వెల్లారు. భారత కాలమానం ప్రకారం నారా లోకేష్ అర్దరాత్రి అమెరికాలోని డల్లాస్ చేరుకున్నారు. అక్కడ మంత్రి లోకేష్‌కు టీడీపీ మద్దతుదారులు, ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత డల్లాస్‌లో తెలుగు డయాస్పోరాతో ఏర్పాటు చేసిన సమావేశంలో నారా లోకేష్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా అమెరికాలో ల్యాండ్ అయిన తర్వాత తనకు ఎదురైన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. ‘‘నేను అమెరికాలో చదివాను… నాలుగేళ్లు అండర్ గ్రాడ్యుయేట్ చేశాను… తర్వాత రెండేళ్లు వాషింగ్టన్ డీసీలో వరల్డ్ బ్యాంకులో పనిచేశాను… మళ్లీ రెండేళ్లు స్టాన్‌ఫర్డ్‌లో ఎంబీఏ చేశాను… దాదాపుగా తొమ్మిదేళ్లు నేను అమెరికాలో ఉన్నాను. అయితే ఎప్పుడూ జరగని సంఘటన ఒకటి ఈరోజు జరిగింది. నేను ఈరోజు ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్నాను… సరిగ్గా ఆరుగురు పోలీసులు వచ్చారు. నన్ను పట్టుకెళ్లడానికి వచ్చారా?, బయటకు తీసుకెళ్లేందుకు వచ్చారా? అని డౌట్ వచ్చింది (నవ్వుతూ)… అయితే వాళ్లు నన్ను ఆగమని చెప్పారు… అప్పుడు నేను ఏమైందని అడిగితే, బయట రద్దీగా ఉందని, నాకు బయటకు వెళ్లేందుకు పర్మిషన్ లేదని అన్నారు. డల్లాస్‌లో తాను అడుగుపెట్టినప్పటీ నుంచి నాకు ఇంత పెద్ద ఘన స్వాగతం పలికి మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అమెరికాలో ఉన్నానా?, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నానా? అనే డౌట్ కూడా వచ్చింది’’ అని నారా లోకేష్ పేర్కొన్నారు. ఇకడ కనిపిస్తున్న మీ ఉత్సాహం, జోష్ చూస్తుంటే, కేకలు వింటుంటే… తన యువగళం పాదయాత్ర రోజులు గుర్తుకువస్తున్నాయని లోకేష్ తెలిపారు. ఆరోజు యువగళం వేళ అప్పటి పాలకులు అడ్డుకుంటే, టీడీపీ శ్రేణులు తగ్గేదేలే అంటూ ముందుకు సాగారని… ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ ఘన స్వాగతం పలికారని చెప్పారు. చంద్రబాబు నాయుడును 53 రోజులు పాటు అక్రమంగా బంధించినప్పుడు, అమెరికాలోని ప్రవాసాంధ్రులు పెద్దఎత్తున బయటకు వచ్చి తమ కుటుంబానికి అండగా నిలిచారని లోకేష్ చెప్పారు. డల్లాస్‌లో ఏకంగా మూడు కార్యక్రమాలు నిర్వహించారని… అది మీకు ఒక కార్యక్రమం కావొచ్చు గానీ, తమ కుటుంబానికి కొండంత బలం ఇచ్చిందని తెలిపారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని చెప్పారు. ఇక, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని లోకేష్ అన్నారు. అలాగే అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడని పేర్కొన్నారు.