
సాక్షి డిజిటల్ న్యూస్: ఎమ్మెల్యేల పనితీరుపై తాను సర్వే చేయిస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. నాలుగు, ఐదు మార్గాల ద్వారా సర్వేలు చేయించుకుంటున్నామని గతంతో పోలిస్తే కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడిందన్నారు. 37 మంది ఎమ్మెల్యేల పనితీరు మరిం మెరుగుపడాల్సి ఉంది అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంతో పోల్చుకుంటే ఎమ్మెల్యేల పనితీరు కాస్త మెరుగుపడింది అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సమీక్షలు, వన్ టు వన్ భేటీల ద్వారా దాదాపు అందరు ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడింది అని చెప్పుకొచ్చారు. అయితే 37మంది ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడాల్సి ఉంది అని చెప్పుకొచ్చారు. ప్రతీ ఒక్క ఎమ్మెల్యే పనితీరుపై నాలుగైదు మార్గాలలో సర్వే చేయిస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అందరి గురించి తెలుసు... సర్వేలు చేయిస్తున్నా ‘ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరు, పాలన గురించి చాలా రకాలుగా సర్వేలు చేయిస్తున్నా. ఏదో ఒక్క సర్వే కాదు.. రకరకాల మార్గాల్లో సర్వేలు చేయిస్తున్నా. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో రియల్ టైమ్‌లో తెలుసుకుంటున్నా. ఏ నాయకుడు ఏ విధంగా ప్రజలకు పనులు చేస్తున్నారో కూడా తెలుసుకుంటున్నా’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ‘మనం ఏం చేశామనే అంశంతో పాటు.. ప్రజలు, కార్యకర్తలతో ఎలా వ్యవహరిస్తారోననేది కూడా ముఖ్యం. కష్టపడి పని చేసే వారికి మంచి పదవులు దక్కుతాయి. ఏడాది ముందు ఎన్నికల కోసం పని చేస్తే ప్రజలు నమ్మరు. అందుకే మొదటి నుంచే పొరపాట్లు సరిదిద్దుకుని, పాలనలో లోటుపాట్లు ఉంటే సరి చేసుకుందాం. ప్రజలు, కార్యకర్తలకు నచ్చని విషయాలు ఉంటే సరి చేసుకుందాం’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ‘ప్రజలు మెచ్చాలి, కార్యకర్తలు ఆమోదించాలి. పార్టీ కోసం అంకితమై పనిచేసే వారిని గుర్తించేకుని పనియాల్సిన బాధ్యత మనపై ఉంది. వారసులైనా సరే.. పని చేస్తేనే వారికి పదవులు వస్తాయి’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రజల్లోకి వెళ్లడానికి నామోషీ వద్దు ‘ప్రజల్లోకి నామోషీ లేకుండా వెళ్లి ప్రభుత్వం చేసిన పనుల్ని వివరించండి. చేసిన పనులు చెప్పడంతో పాటు.. అమలు కాని పనులు ఎందుకు అవ్వలేదో చెప్పాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది. ప్రజలకు ఎంత అందుబాటులో ఉంటే వారు అంత ఆదరిస్తారు. పనిచేయడం ఒక ఎత్తు...జనానికి అందుబాటులో ఉండటం మరొకఎత్తు.’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ‘ఎన్నికల సమయంలో ప్రత్యర్థులు దౌర్జన్యాలు చేసినా ప్రజలు కూటమికి అండగా నిలబడ్డారు. నిర్మొహమాటకుండా వ్యవహరించి గెలుపే ధ్యేయంగా అభ్యర్థులను ఎంపిక చేశాం. సోషల్ రీ-ఇంజనీరింగ్ చేశాం. 2014లో అభివృద్ధి, సంక్షేమ పనులు చేశాం. కానీ రాజకీయం మరిచిపోయాం. చేసింది చెప్పుకోలేకపోయాం. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఎప్పటికప్పుడు చేసిన పనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించాలి.’ అని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.