
సాక్షి డిజిటల్ న్యూస్: దేశీయ విమాన టికెట్ ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం పరిమితిని విధించింది. విమాన టికెట్ ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ విమాన టికెట్ ధరల విషయంలో పరిమితిని విధించింది. ఇండిగో విమాన సర్వీసులు భారీ ఎత్తున రద్దైన నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వశాఖ, శనివారం అత్యవసర చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రకటనను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం దేశీయ విమాన టికెట్ల ధరలపై విధించిన పరిమితులు ఇవే.... ఎకానమీ క్లాస్‌లో కిలోమీటర్ల వారీగా గరిష్ఠ ఛార్జీలు ఇలా ఉన్నాయి. 500 కిలో మీటర్ల వరకు రూ. 7500 ,500 నుండి 1000 కిలోమీటర్ల వరకు రూ. 12000, 1000 నుండి 1500 కిలోమీటర్ల వరకు రూ. 15000, 1500 కి.మీ దాటితే రూ.18000 గా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇండిగో విమాన సర్వీసుల్లో అంతరాయం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసుల్లో సమస్యలు ఏర్పడటంతో ఎంతో మంది ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. కేవలం నాలుగు రోజుల్లోనే 1000కి పైగా ఫ్లైట్‌లు రద్దయ్యాయి. కొత్త ఫ్లైట్ డ్యూట్ టైమ్ లిమిడ్ (FDTL) నిబంధనల అమలుతో ఏర్పడిన సిబ్బంది కొరత కారణంగా ఈ సమస్య తలెత్తినట్లు పేర్కొన్నారు. దీంతో పైలట్లకు సంబంధించిన వారాంత విశ్రాంతి నిబంధనను DGCA తాత్కాలికంగా ఉపసంహరించుకుంది. ప్రయాణికులకు టికెట్ రీఫండ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇండిగో కీలక ఆదేశాలు జారీచేసింది. రీఫండ్ ప్రక్రియను ఆదివారం సాయంత్రం 8 గంటలలోగా పూర్తి చేయాలని తెలిపింది. రీఫండ్ ఆలస్యం గానీ, నిబంధనలు పాటించకపోవడంగానీ తక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. రీషెడ్యూల్‌పై ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయరాదని చెప్పింది. ఇండిగో విమాన సర్వీసులు రద్దు కావడం, అనేక సర్వీసుల్లో జాప్యాలతో దేశవ్యాప్తంగా వేలాది మంది విమాన ప్రయాణికులు విమానాశ్రయాలలో చిక్కుకుపోయారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే విమాన సర్వీసుల రద్దు, ఆలస్యంకు సంబంధించి ప్రయాణికుల సరైన సమాచారం కూడా ఇవ్వకపోవడంపై వారు ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై మరింతగా మండిపడుతున్నారు. అలాగే గతంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని వాపోతున్నారు. ఈ పరిణామాల నేపపథ్యంలో ప్రయాణికులకు బహిరంగ క్షమాపణ చెబుతూ ఇండిగో ఎయిర్‌లైన్స్ బహిరంగ ప్రకటన విడుదల చేసింది.