తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌-2025

★తరలి వస్తున్న 44 దేశాల ప్రముఖులు... ★సమ్మిట్ షెడ్యూల్, ప్రసంగించనున్న అతిథులు వీరే !

సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చడంతో పాటు రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌ను అంతర్జాతీయ స్థాయిలో పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 8 మధ్యాహ్నం ఒంటి గంటన్నరకు గ్లోబల్ సమ్మిట్ ను గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభించనున్నారు. తొలి రోజు ముఖ్యమంత్రి, మంత్రుల ప్రసంగాలు ఉంటాయి. మొత్తం 27 సెషన్లు ఉంటాయి అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ నెల 8, 9 తారీఖుల్లో భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీలో తెలంగాణ గ్లోబెల్ రైజింగ్ - 2025 స‌మ్మిట్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తోందని ఉపముఖ్య‌మంత్రి మల్లు భ‌ట్టి విక్ర‌మార్క చెప్పారు. ఇది పూర్తిగా ఎక‌న‌మిక్ స‌మ్మిట్ అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 2047నాటికి తెలంగాణ 3 ట్రిలియ‌న్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా నిర్వ‌హిస్తున్నట్లు పేర్కొన్నారు. నీతి అయోగ్, ఐఎస్బీ -హైద‌రాబాద్ సలహాలు సూచనలతో విజన్ డాక్యుమెంట్ రూపొందించడం జ‌రిగిందన్నారు. ఈనెల 8 న మధ్యాహ్నం 1:30 కు తెలంగాణ గ్లోబెల్ రైజింగ్ 2025 స‌మ్మిట్ ప్రారంభం అవుతుందని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మాన్ని రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జిష్ణు దేవ్ వ‌ర్మ ప్రారంభిస్తారని ఆయ‌న చెప్పారు. ఫ్యూచ‌ర్ సిటీలో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌డం అత్యంత సంతోష‌క‌రంగా ఉందన్నారు. ముఖ్య‌మంత్రి రేవంత రెడ్డి నాయ‌క‌త్వంలోని మొత్తం కేబినెట్ అంతా క‌లిసి ఆలోచ‌న‌లు చేసి విజ‌న్ డాక్యుమెంట్ రూపొందించిన‌ట్లు చెప్పుకొచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో అంత‌ర్జాయ స్థాయిలో పేరొందిన ఎక‌నమిస్టులు ప్ర‌సంగిస్తారని ఉప ముఖ్య‌మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. 8న మధ్యాహ్నాం 2.30 గంటలకు సీఎం ప్రసంగం తెలంగాణ గ్లోబెల్ రైజింగ్ 2025 స‌మ్మిట్ మొద‌టి రోజు 8న అభిజిత్ బెన‌ర్జీ, ట్రంప్ డైరెక్ట‌ర్ ఆప్ ట్రంప్-మీడియా అండ్ టెక్నాల‌జీస్ గ్రూప్ నుంచి ఎరిక్ స్వేడ‌ర్, శ్రీధర్ బాబు, కర్ణాటక డిప్యూటీ సిఎం డీ కె శివ కుమార్, నోబెల్ బ‌హుమ‌తి గ్రహీత కైలాష్ స‌త్యార్థి, కిర‌ణ్ మ‌జుందార్, కేంద్రమంత్రి కిష‌న్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రిగా తాను కూడా ప్ర‌సంగిస్తామని భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. స‌మ్మిట్‌ను ఉద్దేశించి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మ‌ధ్యాహ్నం 2.30 నిమిషాల‌కు కీల‌క ప్ర‌సంగం చేస్తార‌ని చెప్పుకొచ్చారు. రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఆరంభ వేడుకలో (8 Dec) ప్రసంగించనున్న ప్రముఖ ఆర్థికవేత్తలు, గ్లోబెల్ స‌మ్మిట్‌లో అనంతరం ప‌లు డిపార్ట్మెంట్ లకు సంబంధించిన సెషన్స్ ఉంటాయని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుంచి 4 వరకు సెషన్‌లు ప్రారంభం అవుతాయని అన్నారు. సెషన్ అంశానికి సంబంధించిన శాఖ మంత్రి, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు పాల్గొంటారని తెలిపారు. ఈ సెష‌న్స్‌లో ఎక్స్ ప‌ర్ట్స్ పాల్గొంటారు అని పేర్కొన్నారు. 9వ తేదీ కూడా ఇలాగే సెషన్స్ ఉంటాయి. ఉద‌యం 9 గంట‌ల‌కు కార్య‌క్ర‌మాలు మొద‌ల‌వుతాయి. సాయంత్రం 6 గంటలకు ముగింపు కార్య‌క్ర‌మం ఉంటుంది. ముగింపు కార్య‌క్ర‌మంలో ఎవ‌రెవ‌రు పాల్గొంటారో త‌రువాత తెలియ‌జేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.