హైదరాబాద్ సీఎం చంద్రబాబు విజన్‌కు ప్రత్యక్ష ఉదాహరణ

*పవన్ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి కీలక స్పందన

సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2047’కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆహ్వానించారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో తలపెట్టిన ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్‌కు హాజరుకావాలని ఏపీ సీఎంచంద్రబాబు నాయుడుని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆహ్వానించారు. తెలంగాణలో భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనాలని కోరారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. హైద్రబాద్ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫౌండేషన్ వేశారు అని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో హై టెక్ సిటీ, రహేజా మైండ్ స్పేస్, శిల్పారామం వంటివి కట్టి హైరాబాద్ అభివృద్ధి కి దారి చూపారు అని కొనియాడారు. ‘బెంగళూరు తరువాత హైడ్రాబాద్‌ను ఐటిలో అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు అని హైద్రాబాద్‌లో చంద్రబాబు చేసిన అభివృద్ధి వైఎస్ కొనసాగించారు అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబును ఆహ్వానించాం: ‘నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు విజన్ 2020 డాక్యుమెంట్ చంద్రబాబు నాయుడు తీసుకువచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు విజన్- 2020 అంటే నేను ఆశ్చర్యపడ్డాను. కానీ హైదరాబాద్ అభివృద్ధి చూసిన తర్వాత నిజం అనిపించింది. ‘ నాడు సీఎం చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ అని చెప్పి బిల్ క్లింటన్‌ను ఆహ్వానిస్తే మా కాంగ్రెస్ ఎమ్మెల్యే లు కొంతమంది వెళ్ళలేదు…నేను వెళ్ళాను అని గుర్తు చేశారు. త్వరలో అమరావతికి గ్రీన్ ఫీల్డ్ హైవే…తెలంగాణ బులెట్ రైల్ ప్రాజెక్ట్ వస్తుంది’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.‘గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు కరువు ఉండేది. కానీ అసెంబ్లీలో ఐటి పై చంద్రబాబు మాట్లాడేవారు. కానీ ప్రస్తుతం హైదరాబాద్ చంద్రబాబు అనుకున్న దానికన్నా ఎక్కువ అభివృద్ధి చెందింది. రైజింగ్ తెలంగాణ 2047 గ్లోబల్ సమిట్‌కు ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించాం’అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల రాజకీయంపై చర్చించాం. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించబోతున్న గ్లోబల్ సమ్మిట్ ఇతర దేశాల్లో పోటీ పడే విధంగా జరగబోతుంది అని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడిని తప్పకుండా రావాలని ఆహ్వానించమని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో తాను నేడు సచివాలయంలో కలిసినట్లు తెలిపారు. బిజీ షెడ్యూల్‌లో కూడా గంటన్నర సమయం సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చారు. చంద్రబాబుతో తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై చర్చ జరిగింది. కొన్ని బయటకు చెప్పలేం అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పుకొచ్చారు.దేశంలో సింగిల్ ఎలివేటెడ్ కారిడార్ మంజూరు చేస్తున్నాం అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. అమరావతి నుంచి బందరు వరకు గ్రీన్ ఫీల్డ్ రహదారి వస్తుంది అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *