
సాక్షి డిజిటల్ న్యూస్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో తన సంభాషణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకున్నారు.భారత పర్యటనలో ఉన్న పుతిన్‌కు ప్రధాని మోదీ అద్భుతమైన కానుకను బహుకరించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో తన సంభాషణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకున్నారు.భారత పర్యటనలో ఉన్న పుతిన్‌కు ప్రధాని మోదీ అద్భుతమైన కానుకను బహుకరించారు. వ్లాదిమిర్ పుతిన్‌కు భగవద్గీత రష్యన్ అనువాదం కాపీని అందజేశారు. భగవద్గీత ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తిదాయకమైన గ్రంథం అని మోదీ అభివర్ణించారు. రష్యన్ భాషలో ఉన్న భగవద్గీత కాపీని పుతిన్‌కు అందజేస్తున్న ఫొటోను ఎక్స్‌లో షేర్ చేసిన ప్రధాని మోదీ... ‘‘రష్యన్‌లో గీత ప్రతిని అధ్యక్షుడు పుతిన్‌కు అందించారను. గీత బోధనలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తాయి’’ అని పేర్కొన్నారు. అంతేకాకుండా గురువారం సాయంత్రం 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధానమంత్రి అధికారిక నివాసంలో ప్రధాని మోదీ... పుతిన్‌కు ప్రైవేట్ డిన్నర్ కూడా ఇచ్చారు. పుతిన్ రాక నేపథ్యంలో ప్రధానమంత్రి అధికారిక నివాసంను భారతదేశం-రష్యా జెండాలు, ప్రత్యేక లైటింగ్‌తో అలంకరించారు.