
జనం న్యూస్:తెలుగుదేశం పార్టీలో వ్యక్తులు శాశ్వతం కాదు. పార్టీ శాశ్వతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ దిశానిర్దేశం చేశారు.‘చట్టబద్ధమైన పనుల కోసం కేడర్ వెళితే అధికారులు స్పందించాలి. అధికారంలోకి రావడం వెనుక కార్యకర్తల కష్టం దాగి ఉంది’అని నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు. టీడీపీ కార్యకర్తలు ఆఫీసులకు వెళితే గౌ రవంగా చూడాల్సిందే.గ్రూపు రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టండి’అని నారా లోకేశ్ దిశానిర్దేశం చేశారు.తెలుగుదేశంలో వ్యక్తులు శాశ్వతం కాదు, పార్టీ శాశ్వతమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. పాలకొండ నియోజకవర్గం భామిని కార్యకర్తలను ఉద్దేశించి యువనేత లోకేశ్ ప్రసంగించారు. తొలుత పార్టీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం యువనేత లోకేశ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు, నేను ఎక్కడికి వెళ్లినా కార్యకర్తలను కలిశాకే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాం. అధికారంలోకి రావడానికి దశాబ్ధాలుగా ఎత్తిన పసుపుజెండా దించకుండా కష్టపడిన ప్రతి కార్యకర్త శ్రమ దాగిఉంది. 2019-24 నడుమ సైకో పాలన చూశాం. బయటకు రావాలంటే గేట్లకు తాళ్లుకట్టారు. నాపై ఎస్సీ,ఎస్టీ కేసులు, హత్యాయత్నం కేసులు పెట్టారు. యువగళం పాదయాత్ర చేస్తుంటే జిఓ 1 తెచ్చారు. అయినా నేను తగ్గలేదు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. కరుడుగట్టిన కార్యకర్తలే నాకు స్పూర్తి. ‘ప్రతిపక్షంలో ఉండగా అంజిరెడ్డితాత నామినేషన్ పత్రాలు లాక్కునేందుకు ప్రయత్నిస్తే తొడగొట్టి మరీ నామినేషన్ వేశారు. పల్నాడులో మంజుల గారి పై ప్రత్యర్థులు దాడి చేసినా పోలింగ్ బూత్ వద్ద వైసిపి రిగ్గింగ్ అడ్డుకున్నారు. అటువంటి కరుడుగట్టిన కార్యకర్తలే నాకు స్పూర్తి. పల్నాడులో తోట చంద్రయ్య అనే కార్యకర్తను మెడపై కత్తిపెట్టి వారి నాయకుడికి జై కొట్టమంటే జై టీడీపీ, జై చంద్రబాబు అని ప్రాణాలు వదిలారు’టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు.‘చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా 94శాతం సీట్ల సాధించడం వెనుక మీ అందరి కష్టం, చెమట దాగి ఉన్నాయి. వేదికపై ఉన్న నాయకులందరం అదృష్టవంతులం. అయిదేళ్లు మీరు మా వెంట నిలిచారు. నాయకులు వెళ్లిపోయినా కార్యకర్తలే అండగా నిలిచారు. చంద్రబాబుని 53రోజుల్లో జైల్లో పెడితే అండగా నిలబడి బయటకొచ్చి పోరాడింది కార్యకర్తలే, అందుకే పార్టీ మీకు రుణపడి ఉంటుంది. ఇంత అద్భుతమైన కార్యకర్తలు టీడీపీకి మాత్రమే సొంతం. ఒక్క పిలుపు ఇస్తే సైన్యంలా తరలివచ్చే కేడర్ మనకే సొంతం’ మంత్రి నారా లోకేశ్ దిశానిర్దేశం చేశారు.