
జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌లను చీటింగ్ కేసు పెట్టి బొక్కలో వేయాలని సంచలన కామెంట్స్ చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ గురువారం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. సూపర్ సిక్సులు, సూపర్ సెవెన్లు ఇచ్చేశామని చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని. ఆయన గోబెల్స్‌కు టీచర్, మెంటార్ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘సూపర్ సిక్సు, సూపర్ హిట్టు. ఇదీ చంద్రబాబు ఇచ్చిన అడ్వర్టైజ్‌మెంట్. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లు చేసేశాం, విజయవంతంగా బ్రహ్మాండంగా చేసేశాం అని చంద్రబాబు అబద్దాలు చెప్పేస్తున్నాడు. నిన్న పబ్లిక్ మీటింగ్‌లో కూడా చెప్పేస్తున్నాడు. వాళ్లకు సంబంధించిన పాంప్లెట్ పేపర్లు, టీవీ ఛానళ్లలో అడ్వర్టైజ్‌మెంట్‌లు కూడా ఇచ్చేస్తున్నాడు. నిజంగా చంద్రబాబు నుంచి గోబెల్స్ నెర్చుకోవాలి. గోబెల్స్ అనే వ్యక్తి హిట్లర్ టైమ్ లో కమ్యూనికేషన్ మినిస్టర్. ఆయన పేరు చెబుతారు. కానీ వాస్తవంగా చంద్రబాబునాయుడు పేరు చెప్పాల. చంద్రబాబు నాయుడు గోబెల్స్ కు టీచర్, మెంటార్’’ అని జగన్ విమర్శలు చేశారు. ఆడబిడ్డ నిధి అంటూ 18 ఏళ్లు నిండిన ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి అక్కకూ నెలనెలా రూ. 1500 చొప్పున సంవత్సరానికి 18 వేలు ఇస్తామని చెప్పాడని, మరిరెండేళ్లయ్యింది రూ.36 వేలు ఇచ్చారా? అని జగన్ ప్రశ్నించారు. 50 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పింఛన్ అన్నాడని. మరి వారికి పింఛన్ ఇచ్చారా? అని ప్రశ్నలు సంధించారు. అమ్మఒడిని పేరు మార్చి తల్లికి వందనం అన్నారని. తీరా చూస్తే మొదటి సంవత్సరం ఎగ్గొట్టారని విమర్శించారు. రెండో సంవత్సరానికి వచ్చే సరికే ఏకంగా 20 లక్షల మంది పిల్లలకు తగ్గించేశాడని ఆరోపించారు. అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ కింద ఏడాదికి రూ. 20 వేలు ఇస్తామని అన్నారని. రెండేళ్లకు కలిపి రూ.40 వేలు ఇవ్వాల్సింది పోయి, ఇచ్చింది రూ.10 వేలనని, ఇది మెసం కాదా? అని ప్రశ్నించారు.