
జనం న్యూస్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో 20 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో 20 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (MAUD) విభాగం. 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లను తెలంగాణ మునిసిపాలిటీల చట్టం, 2019 పరిధి నుంచి అధికారికంగా తొలగిస్తూ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ చట్టం, 1955 ప్రకారం "నగరం" పరిధిలోకి తీసుకువస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రేటర్ పరిధిని తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్) వరకు విస్తరిస్తున్నట్టు ఉత్తర్వుల్లో తెపింది. దీంతో హైదరాబాద్ శివార్లలోని 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన రికార్డులు, బాధ్యతలు జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చాయి. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు.జీహెచ్ఎంసీలోని ఏ డిప్యూటీ కమిషనర్ విలీనం అయిన ఏ మున్సిపాలిటీ/మున్సిపల్ కార్పొరేషన్ రికార్డులను స్వాధీనం చేసుకోవాలనేది అందులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన బాధ్యతలను డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ (డీఎంసీ)లకు బాధ్యతలు అప్పగించారు. అలాగే, స్వాధీనం చేసుకున్న రికార్డులను సంబంధిత జోనల్ కమిషనర్ల ఆధీనంలో ఉంచాలని చెప్పారు. ఈ స్థానిక సంస్థలకు చెందిన మినిట్స్ పుస్తకాలను స్వాధీనం చేసుకోవాలని, వాటి ప్రస్తుత బ్యాంక్ బ్యాలెన్స్‌లను పేర్కొన్న జీహెచ్ఎంసీ బ్యాంకు ఖాతాకు బదిలీ చేయాలని. ఆ తర్వాత ఆ స్థానిక సంస్థల ప్రస్తుత బ్యాంకు ఖాతాలను మూసివేయాలని సూచించారు. అంతేకాకుండా, ఆయా స్థానిక సంస్థల్లోని ఉద్యోగుల జాబితాలు, స్థిరాస్తుల రికార్డులు, కొనసాగుతున్న పథకాలు, పనుల వివరాలు, గత మూడు సంవత్సరాలలో జారీ చేయబడిన అన్ని భవనాలు, లేఅవుట్ అనుమతులతో సహా మొత్తం సమగ్ర వివరాల రికార్డులను స్వాధీనం చేసుకోవాలని కూడా ఆదేశించారు. విలీనమైన 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల కార్యాలయ భవనాల వద్ద జీహెచ్ఎంసీ నేమ్‌బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. 6 జోన్లు, 57 సర్కిళ్లు. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం ఆరు జోన్లు, 30 సర్కిళ్లు ఉన్న సంగతి తెలిసిందే. జీహెచ్ఎంసీలో విలీనమైన ఒక్కో స్థానిక సంస్థను ఒక్కో సర్కిల్‌గా మారుస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ కావడంతో. మొత్తం సర్కిళ్ల సంఖ్య 57కు చేరింద. అయితే జోన్ల సంఖ్యలో ఎలాంటి మార్పు చేయలేదు. అయితే జీహెచ్ఎంసీలో విలీనమైన సంస్థలు ఏ జోన్ల పరిధిలోకి వస్తాయనేది కూడా వెల్లడించారు. విలీనమైన మున్సిపాలిటీల కమిషనర్ల హోదాను ఇంఛార్జ్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్‌గా మార్చుతూ వారికి అక్కడే పోస్టింగ్‌లు ఇచ్చారు. ఏ జోన్లో ఏ మున్సిపాలిటీ/మున్సిపల్ కార్పొరేషన్. చార్మినార్ జోన్: 1. ఆదిభట్ల, 2. బడంగ్పేట్, 3. జల్పల్లి, 4. శంషాబాద్, 5. తుర్కయాంజాల్. శేరిలింగంపల్లి జోన్: 1. బండ్లగూడ జాగీర్, 2. మణికొండ, 3. నార్సింగి, 4. అమీన్పూర్, 5. తెల్లాపూర్, ఎల్బీ నగర్ జోన్: 1. మీర్పేట్ 2. పెద్ద అంబర్ పేట, 3. తుక్కుగూడ, 4. దమ్మాయిగూడ, 5. ఘట్కేసర్, 6. పీర్జాదిగూడ, 7. పోచారం, సికింద్రాబాద్ జోన్. 1. బోడుప్పల్. 2. జవహర్ నగర్. 3. నాగారం. 4. తూంకుంట. కూకట్ పల్లి జోన్. 1. దుండిగల్. 2. గుండ్లపోచంపల్లి. 3. కొంపల్లి. 4. మేడ్చల్. 5. నిజాంపేట్. 6. బొల్లారం.