సాక్షి డిజిటల్ న్యూస్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఢిల్లీలోని పాలం టెక్నికల్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. అనంతరం పుతిన్, మోదీలు ఒకే కారులో ఎక్కి ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి… 7 లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని మోదీ నివాసానికి చేరుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఢిల్లీలోని పాలం టెక్నికల్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. దాదాపు నాలుగేళ్త తర్వాత భారత పర్యటనకు విచ్చేసిన పుతిన్‌కు స్వాగతం పలికేందుకు భారత ప్రధాని మోదీ స్వయంగా పాలం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో పుతిన్ విమానం ల్యాండ్ అయిన తర్వాత ఆయనకు మోదీ స్వాగతం పలికారు. ఇందుకోసం ప్రధాని మోదీ ప్రోటోకాల్‌న సైతం పక్కనపెట్టారు. ఇక, విమానం నుంచి కిందకు దిగిన తర్వాత పుతిన్, మోదీలు కరచాలనం చేసుకుని… ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అక్కడ భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన కళాకారుల నృత్య ప్రదర్శనను పుతిన్ ఆసక్తిగా తిలకించారు. అనంతరం పుతిన్, మోదీలు ఒకే కారులో ఎక్కి ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి… 7 లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని మోదీ నివాసానికి చేరుకున్నారు. అక్కడ మోదీ… పుతిన్‌ను దగ్గరుండి లోనికి తీసుకెళ్లారు. అయితే ఈరోజు పుతిన్ అధికారిక కార్యక్రమాలు లేకపోయినప్పటికీ… పుతిన్ గౌరవార్థం ఆయనకు మోదీ తన అధికారిక నివాసంలో ప్రైవేట్ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఆ విందులో పుతిన్ పాల్గొన్నారు. అయితే ఈ పరిణామాలు ప్రపంచ దేశాలను సైతం ఆకర్షించాయి. ఇక, ఈరోజు రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న పుతిన్… శుక్రవారం (డిసెంబర్ 5) ఉదయం 11 గంటల ప్రాంతంలో రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంటారు. అక్కడ పుతిన్ అధికారిక స్వాగతం అందుకోనున్నారు. అనంతరం రాజ్‌ఘాట్‌కు చేరుకుని మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగే 23వ ఇండియా-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పుతిన్, మోదీలు పాల్గొననున్నారు. అనంతరం ఇరు దేశాల సంయుక్తంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నాయి. ఇందులో మోదీ, పుతిన్‌లు పాల్గొననున్నారు. ఆ తర్వాత రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే రష్యా టూడే ఇండియా ఛానల్ లాంచ్‌లో పాల్గొంటారు. శుక్రవారం సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే అధికారిక విందులో పుతిన్ పాల్గొనున్నారు. శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో తిరిగి రష్యాకు బయలుదేరి వెళతారు. మొత్తంగా పుతిన్ దాదాపు 27 గంటల పాటు భారత్‌లో ఉండనున్నారు. అయితే పుతిన్ పర్యటన… ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన అంశాలకు మాత్రమే పరిమితం కాకుండా, దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి దోహపడనుందని భావిస్తున్నారు. ఇక, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల భారత పర్యటన నేపథ్యంలో ఆయన పర్యటించే ఢిల్లీని భద్రతా పరంగా హై అలర్ట్‌లో ఉంచారు. కఠినమైన భద్రతా నిబంధనల కారణంగా ఆయన బస చేసిన ఖచ్చితమైన ప్రదేశం వెల్లడించడం లేదని పోలీసులు తెలిపారు. పుతిన్ రాక నుంచి నిష్క్రమణ వరకు…ప్రతి కదలికను సంయుక్తంగా పనిచేసే బహుళ భద్రతా విభాగాలు ట్రాక్ చేస్తాయని సీనియర్ పోలీసు అధికారులు చెప్పారు. ఢిల్లీ పోలీసులు, కేంద్ర సంస్థలు, పుతిన్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది సున్నితమైన ప్రదేశాలలో స్వాట్ బృందాలు, ఉగ్రవాద నిరోధక విభాగాలు, స్నిపర్లు, త్వరిత-ప్రతిచర్య బృందాలతో సహా బహుళ-అంచెల భద్రతా గ్రిడ్‌ను ఏర్పాటు చేశాయి.