ఏపీ రాజధానికి చట్టపరమైన గుర్తింపు

* కేంద్రం కీలక అడుగులు.

జనం న్యూస్: అమరావతి రాజధాని విషయంలో కీలక పరిణామంచోటు చేసుకుంది. అమరావతి చట్టబద్దత అంశంలో కదలిక వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2)లో సవరణ ద్వారా అమరావతిని స్పష్టంగా రాజధానిగా చేర్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు బిల్లును సిద్ధం చేస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే న్యాయశాఖ ఆమోదం తెలిపింది. దీంతో ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశంలోనే బిల్లును ప్రవేశపెట్టిఆమోదింపజేసే అవకాశం ఉంది. అనంతరం అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కేంద్ర శరవేగంగా ప్రయత్నాలు చేస్తోంది. అమరావతికి రాజధాని హోదా కల్పించే ప్రక్రియ ఊపందుకుంది.ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. అమరావతికి చట్టబద్దత కల్పించే ప్రక్రియలో భాగంగా సవరణ బిల్లు తీసుకురావాలని నిర్ణయించింది.ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2)లో సవరణ ద్వారా అమరావతిని స్పష్టంగా రాజధానిగా చేర్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ నిర్ణయానికి ఇప్పటికే కేంద్ర న్యాయ శాఖ ఆమోదం తెలిపింది. త్వరలోనే కేబినెట్ దృష్టికి సైతం ఈ చట్టబద్దత బిల్లు వెళ్లనుంది. ఆ తర్వాత దానిని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ గెజిట్ విడుదల చేసే అవకాశం ఉంది.గత కొన్నాళ్లుగా అమరావతి రాజధానికి చట్ట బద్ధత కల్పించాలని ఏపీలో డిమాండ్ నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అమరావతిని రాజధానిగా ప్రకటించిన చంద్రబాబు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ రాజధానిగా ఉండగా…ఏపీకి నాటి సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ఈ రాజధాని ఏర్పాటుకు భూములు ఇచ్చేందుకు 29 గ్రామాలకు చెందిన రైతులు ముందుకు వచ్చారు. రాజధాని కోసం త భూములను దాదాపుగా 34 వేల ఎకరాలు స్వచ్చంధంగా ప్రభుత్వానికి ఇచ్చారు. దీంతోనాటి టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాజధాని పనులు చేపట్టింది. సింగపూర్ ప్రభుత్వం రూపొందిచిన మాస్టర్ ప్లాన్ ప్రకారం పనులు చేపట్టింది. అసెంబ్లీ, సచివాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను సైతం నిర్మించింది. అంతేకాదు వాటిలోనే కార్యకలాపాలను సైతం చేపట్టింది. అలాగే రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల నిమిత్తం రహదారులు, విద్యుత్, తాగునీరు ఇతర వసతులను సైతం కల్పించింది. మూడు రాజధానులన్న వైసీపీ ప్రభుత్వం2019అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించింది.151 స్థానాల్లో గెలుపొంది వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అనంతరం ఏపీకి మూడు రాజధానులు ప్రకటించారు. దీంతో అమరావతి రాజధానిపై నీలిమబ్బులు కమ్ముకున్నాయి. అమరావతిని శాసన రాజధానిగా…కర్నూలును న్యాయరాజధానిగా…విశాఖపట్నంను పాలనా రాజధానిగా వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఏపీకి అమరావతియే ఏకైక రాజధానిగా ఉండాలంటూ రైతులు ఉద్యమించారు. సంవత్సరాల తరబడి నిరసనలు చేపట్టారు. కొంతమంది ప్రాణాలు సైతం కోల్పోయారు. అమరావతి టు తిరుపతి వరకు పాదయాత్ర సైతం చేసిన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రలో ఉద్రిక్తత పరిస్థితులు సైతం చోటు చేసుకున్నాయి. అంతేకాదు అమరావతి రైతుల ఉద్యమంలో ఎంతోమంది అరెస్టులు సైతం అయిన సంగతి తెలిసిందే. పునర్విభజన చట్టాన్ని సవరించేది ఇలా! ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలంటే పునర్విభజన చట్టం 2014ను సవరించాల్సి ఉంటుంది. తెలంగాణకు రాజధానిగా హైదరాబాద్‌ను పొందుపరిచారే తప్ప ఏపీకి రాజధాని అమరావతి అని చూపలేదు. ఈ క్రమంలోనే ఏపీ పునర్విభజన చట్టం 2014ను సవరించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే అమరావతి రాజధానిగా గెజిట్ ఇవ్వాల్సి ఉంటుంది. పునర్విభజన చట్టం పార్ట్-2 కింద 5(1) ప్రకారం నిర్ణయించిన తేదీ నుంచి పదేళ్లకు మించకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది. పార్ట్ 2 కింద 5(2) సబ్ సెక్షన్ 5(1)లో పేర్కొన్న గడువు ముగిసన తర్వాత తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుంది. అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని ఏర్పాటు అవుతుంది. ఈ క్రమంలో అమరావతిని ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా ప్రకటిస్తూ విభజన చట్టంలో సవరణ చేస్తారు. పార్ట్ 2 5(2) సబ్ సెక్షన్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఏర్పాటవుతుంది అనే చోట అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రాజధాని ఏర్పాటైందని పేర్కొంటారు. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఆ తర్వాత పార్లమెంట్‌కు సవరణ బిల్లు ఆమోదం తెలపాలి. అనంతరం గెజిట్ నోటిఫికేషన్ విడుదల అవుతుంది. వీటన్నింటిపై ఫోకస్ పెట్టిన కేంద్రం శరవేగంగా అడుగులు వేస్తోంది. రైతుల డిమాండ్ ఇదే. అమరావతిని రాజధానిగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటిస్తే వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రైతుల్లో ఆందోళన నెలకొంది.ప్రభుత్వాలు మారుతుంటే 34 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల్లో టెన్షన్ నెలకొంది. ప్రభుత్వాలు మారుతుంటే రాజధాని మారిపోతుండటంతో భవిష్యత్‌లో ఇది ఇబ్బందికరం అని రైతులు భావించారు. ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడం. మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడంతో అమరావతి రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. అమరావతికి చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు. తాజాగా అమరావతికి సంబంధించి రెండో విడత ల్యాండ్ ఫూలింగ్ చేపడుతున్నారు. అయితే అమరావతికి చట్టబద్దత కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోసీఎం చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఒత్తిడి పెంచడంతో రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ బిల్లును రూపొందించే పనిలో నిమగ్నమైంది కేంద్ర ప్రభుత్వం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *