సౌదీ రోడ్డు ప్రమాదం చుట్టూ ప్రశ్నలు

★ బ్రతికిన ప్రయాణికుడు చెప్పిన ఘటనా విశ్లేషణ.

జనం న్యూస్: సౌదీ అరేబియాలో నవంబర్ 17న జరిగిన బస్సు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన 45 మంది ప్రాణాలు కోల్పోగా, ఒకే ఒక్క వ్యక్తి మహమ్మద్ అబ్దుల్ షోయబ్ మాత్రం తీవ్ర గాయాలతో బయటపడ్డారు. అయితే తాజాగా హైదరాబాద్‌కు చేరుకున్న షోయబ్. ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు ఏం జరిగిందనేది తెలిపారు. హైదరాబాద్: సౌదీ అరేబియాలో నవంబర్ 17న జరిగిన బస్సు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన 45 మంది ప్రాణాలు కోల్పోగా, ఒకే ఒక్క వ్యక్తి మహమ్మద్ అబ్దుల్ షోయబ్ మాత్రం తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం తర్వాత అక్కడే కొద్ది రోజులు చికిత్స తీసుకున్న మహమ్మద్ అబ్దుల్ షోయబ్ తాజాగా హైదరాబాద్‌కు చేరుకున్నారు. అయితే సౌదీలో బస్సు ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు ఏం జరిగిందనే వివరాలను వెల్లడించారు. మహమ్మద్ అబ్దుల్ షోయబ్ ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ బస్సులోని ఓ ప్రయాణికుడు మూత్ర విసర్జన కోసం బస్సును ఆపమని కోరిన సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాదం తర్వాత డ్రైవర్ బస్సులోని ప్రయాణికులను కాపాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడని చెప్పారు. బస్సులో తన తల్లిదండ్రులు, తాత ఉన్నారని అయితే వారు ప్రమాదంలో మరణించారని తెలిపారు. ‘‘నేను నా కుటుంబంతో కలిసి ఉమ్రాకు వెళ్ళాను మేము మదీనాకు వెళ్తుండగా, ఒక ప్రయాణీకుడు బస్సు డ్రైవర్‌ను మూత్ర విసర్జన కోసం బస్సు ఆపమని అడిగాడు. డ్రైవర్ బస్సును ఆపగానే వెనుక నుంచి ఒక ట్యాంకర్ బస్సును ఢీకొట్టింది. డ్రైవర్ కిటికీలోంచి తప్పించుకున్నాడు. బస్సులోని ప్రయాణీకులలో ఎవరికీ సహాయం చేయడానికి ప్రయత్నించలేదు మంటలు వ్యాపించిన తర్వాత, నేను కిటికీలోంచి తప్పించుకున్నాను. నా బట్టలు కూడా కాలిపోయాయి బస్సులో నాతో సహా 46 మంది ప్రయాణికులు ఉన్నారు. మిగతా అందరూ చనిపోయారు. నా తండ్రి, తల్లి, తాత బస్సులో నాతో పాటు ఉన్నారు. వారు ఈ ప్రమాదంలో మరణించారు. నాకు ఇప్పుడు మద్దతు లేదు. అందుకే నాకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నేను తెలంగాణ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను అని మహమ్మద్ అబ్దుల్ షోయబ్ పేర్కొన్నారు.