భారత్‌లో 25 లక్షల హెచ్ఐవీ కేసులు

* ఎయిడ్స్ కేసుల్లో ప్రపంచంలోనే రెండో దేశంలో భారత్‌

పయనించే సూర్యుడు న్యూస్ : దేశంలో వయోజనుల్లో హెచ్ఐవీ వ్యాప్తి రేటు, వార్షిక సంక్రమణ రేటు తక్కువగానే ఉండటం కాస్త ఊరట కలిగిస్తోంది. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదిక విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం హెచ్ఐవీతో జీవిస్తున్న వ్యక్తుల సంఖ్య భారతదేశంలో సుమారు 25.61 లక్షలుగా ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ సంఖ్య బట్టి చూస్తే.. భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద హెచ్ఐవీ బాధితులు ఉన్న దేశం కావడం గమనార్హం. ఇంటర్నేషనల్ ఎయిడ్స్ డే రోజున.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా విడుదల చేసిన ‘ఇండియా హెచ్ఐవీ ఎస్టిమేషన్ 2025’ నివేదిక ప్రకారం.. 2024లో దేశంలో 25.61 లక్షల మంది హెచ్ఐవీతో జీవిస్తున్నారని వెల్లడైంది. మహారాష్ట్రలో అత్యధికంగా 3.99 లక్షల మంది ఎయిడ్స్ రోగులు ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో 3.10 లక్షలు, కర్ణాటక 2.91 లక్షలు, తెలంగాణలో 2 లక్షల మంది ఉన్నారు. దేశంలోని మొత్తం బతికి ఉన్న హెచ్ఐవీ రోగుల్లో 74 శాతం మంది కేవలం ఇలాంటి 9 రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం. కొత్తగా నమోదు అవుతున్న ఎయిడ్స్ కేసుల్లో 73 శాతం లైంగిక సంక్రమణ ద్వారానే వ్యాప్తి చెందుతున్నాయని వెల్లడైంది. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం కింద 2010తో పోలిస్తే కొత్త హెచ్ఐవీ కేసులు 48.7 శాతం.. ఎయిడ్స్ సంబంధిత మరణాలు 81.4 శాతం తగ్గడమే. తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవీ సంక్రమణ 74.6 శాతం తగ్గింది. మిజోరాం, నాగాలాండ్ వంటి ఈశాన్య రాష్ట్రాలలో హెచ్ఐవీ వైరస్ వ్యాప్తి రేటు 1 శాతం కంటే ఎక్కువగా ఉండడం. భారత్‌లో మొత్తం 25.61 లక్షల మంది హెచ్ఐవీ రోగులు ఉండగా.. వారిలో 13.97 లక్షల మంది పురుషులు.. 11.64 లక్షల మంది స్త్రీలు ఉన్నారు. జనాభా పరిమాణం కారణంగా.. దక్షిణాఫ్రిగా తర్వాత భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద హెచ్ఐవీ బాధితుల జనాభాను కలిగి ఉంది. మన దేశంలో వయోజనుల హెచ్ఐవీ వ్యాప్తి రేటు 0.20 శాతంగా ఉంది. వార్షిక సంక్రమణ రేటు ప్రతి 1,000 మంది సోకని జనాభాకు 0.05 వద్ద చాలా తక్కువగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *