నిరుద్యోగుల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టుగా ప్రకటించారు. ప్రజా పాలన-ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో రూ. 262.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బబాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హుస్నాబాద్‌లో ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘‘తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశాం. తెలంగాణ సాధించుకున్నది ఉద్యోగాల కోసమేనని నిరూపించాం. ఇంకొక 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం. త్వరలోనే 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి రెండున్నరేళ్ల పాలన పూర్తయ్యేలోపు లక్ష ఉద్యోగాలను భర్తీ చేయనున్నాం’’ అని పేర్కొన్నారు. తమది ప్రజా ప్రభుత్వం అని ప్రజల కోసం పనిచేస్తుందని, ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనుల వివరాలు 1. రూ. 44.12 కోట్లతో హుస్నాబాద్‌లో ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణం. 2. రూ. 45.15 కోట్లతో హుస్నాబాద్‌లో ATC ఏర్పాటుకు శంకుస్థాపన. 3. రూ. 20 కోట్లతో హుస్నాబాద్ మునిసిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులు. 4. రూ. 8.60 కోట్లతో RTA యూనిట్ కార్యాలయం. 5. రూ. 86 కోట్లతో హుస్నాబాద్ అర్బన్ – కొత్తపల్లి ప్యాకేజీ-1 లో భాగంగా 4 లైన్ల రహదారి నిర్మాణం. 6. రూ. 58.91 కోట్లతో హుస్నాబాద్ – అక్కన్నపేట 4 లైన్ల రహదారి నిర్మాణం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *