దివ్యాంగులకు 7 వరాలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

*ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం...

సాక్షి డిజిటల్ న్యూస్: ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లండి…పూర్తిగా ఆదుకుంటా.మీకు అండగా ఉంటా…మీకు మీరు ఏమీ చేయలేమని అనుకోవద్దు. మీకు అండగా ఉంటా’అని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు 7 వరాలు ప్రకటించారు. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే స్థానిక సంస్థల్లో ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దివ్యాంగులు ఎప్పుడూ బలహీనులు కాదు… వారు విభిన్న ప్రతిభావంతులు. విభిన్న ప్రతిభావంతులకు కొంచెం మద్దతిస్తే విజయం సాధించగలరు.విల్ పవర్, పట్టుదల, శక్తి విభిన్న ప్రతిభావంతులకు ఉంది’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.‘పట్టుదలకు దివ్యాంగులు చిరునామాగా ఉంటారు మీకు అండగా ఉంటా…మీకు మీరు ఏమీ చేయలేమని అనుకోవద్దు. మీకు అండగా ఈ ఈ సీబీఎన్ ఉన్నారు. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లండి…పూర్తిగా ఆదుకుంటా’ అని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅథిగా సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ‘మీతో మమేకం కావాలి…మనోధైర్యం ఇవ్వాలనే ఈ కార్యక్రమానికి వచ్చా’అని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. దివ్యాంగ క్రికెటర్లకు నగదు అందజేత ఇటీవల అంధ మహిళల ప్రపంచ కప్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన కరుణ కుమారి, దీపికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. కరుణ కుమారి, దీపిక జాతి గర్వపడేలా క్రికెట్ కప్ పోటీల్లో రాణించి స్ఫూర్తిని నింపారు… వారికి మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ కార్యక్రమం ద్వారా వారికి అండగా ఉండటమే కాదు..పూర్తిగా ప్రోత్సాహించాలి. దివ్యాంగులు ఎప్పుడూ బలహీనులు కాదు… వారు విభిన్న ప్రతిభావంతులు అని సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున కరుణ కుమారికి రూ.15 లక్షలు, ఇంటి నిర్మాణం చేపడతామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మరో క్రీడాకారిణి దీపికకు కూడా ఏపీ ప్రభుత్వం తరపున రూ. 10 లక్షల ప్రొత్సాహం, ఇంటి నిర్మాణం చేపడతామని ప్రకటించారు. కోచ్ అజయ్ కుమార్ రెడ్డికి సీఎం చంద్రబాబు నాయుడు రూ.2.50 లక్షల నగదు ప్రొత్సాహకం ప్రకటించారు. ఏసీఏ తరపున అంధ మహిళల క్రికెట్ టీంకు రూ.10 లక్షల చెక్కును సీఎం చంద్రబాబు నాయుడు అందజేశారు. ఏసీఏ, గొట్టిపాటి హర్షవర్ధన్ తరుపున కరుణ కుమారికి రూ.5 లక్షల చొప్పున రూ.10 లక్షల చెక్కును సీఎం చంద్రబాబు నాయుడు అందజేశారు. అనంతరం దివ్యాంగులకు సీఎం చంద్రబాబు నాయుడు ఉపకరణాలు పంపిణీ చేశారు. దివ్యాంగులకు అండగా ఉన్నది మా ప్రభత్వమే ‘సమాజంలో అందరిలాగా దివ్యాంగులకు అవకాశాలు, హక్కులు, గౌరవం పొందాలి. అనుకూలమై సమాజాన్ని నిర్మించాలనే థీమ్‌తో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దివ్యాంగుల ఎదుగుదలకు ఉన్న అడ్డంకులు తొలగిస్తూ అవసరమైన విధానాలు రూపొందిస్తున్నాం’అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ‘దివ్యాంగులకు అండగా ఉన్నది మా ప్రభుత్వమే. మొదట ఎన్టీఆర్ రూ.35 పింఛను ఇచ్చారు. తర్వాత 2014లో సీఎం అవ్వగానే దివ్యాంగుల పింఛను రూ.3000 చేశాం. 2024లో మళ్లీ రూ.6,000కు పెంచాం. దేశంలో ఎక్కడా రూ.6 వేలు పెన్షన్ ఇవ్వడం లేదు. ఇదీ దివ్యాంగుల పట్ల మా ప్రభుత్వానికి ఉండే అభిమానం, ప్రేమ’అని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. దివ్యాంగులు నడపడానికి మోటార్ వాహనాలు ‘రాష్ట్రంలో 7.68 లక్షల మంది దివ్యాంగులకు ప్రతి నెలా రూ.470 కోట్లు, ఏడాదికి రూ.6 వేల కోట్లు పింఛన్ల రూపంలో ఇస్తున్నాం. బ్యాక్ లాగ్ పోస్టులకు స్పెషల్ రిక్రూట్ మెంట్ డ్రైవ్‌ను పొడిగిస్తున్నాం. దివ్యాంగులు నడపడానికి మోటార్ వాహనాలు ఇస్తున్నాం. ఈ ఏడాది 1800 వాహనాలను దివ్యాంగులకు ఇస్తున్నాం’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వీటితో పాటు వీల్ చైర్లు ట్రై సైకిళ్లు, వినికిడి యంత్రాలు దాదాపు 14 వేల మందికి వివిధ పంపిణీ చేశాం అని తెలిపారు. గత పాలకుల అస్తవ్యస్థ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా ఛిన్నాబిన్నం అయినా దివ్యాంగులను ఆదుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వైకల్యం విజయానికి అడ్డం కాదని నిరూపించిన కరుణ కుమారి మరోవైపు వైకల్యం విజయానికి అడ్డం కాదని కరుణ కుమారి, దీపిక, అజయ్ కుమార్ రెడ్డి నిరూపించారు అని సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు. అల్లూరి జిల్లాకు చెందిన కరుణ కుమారి ఎంతో ప్రేరణతో ఉండేది. కేవలం శబ్దంతోనే క్రికెట్ నేర్చుకుంది. ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా కప్పుతో ఇంటికి వస్తానని తండ్రికి మాట ఇచ్చి అవార్డుతో ఇంటికి వచ్చి మాట నిలబెట్టుకుంది అని ప్రశంసించారు. ఇందుకు అజయ్ కుమార్ రెడ్డి ట్రైనింగ్ ఇచ్చారు. తీవ్రమైన దృష్టిలోపం ఉన్నా ప్రతిభలో వెనకబడలేదు అని సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. 42 పరుగులు చేసి దేశానికి కప్ రావడంలో కీలకంగా వ్యవహరించారు.‘ఆమెను చూసి నాకు తృప్తి కలిగింది. ఆధునిక వసతులతో ఉన్న పాఠశాలలో ఆడుకోలేదు… ప్రభుత్వ స్కూల్లో చదవుకుని ప్రపంచ కప్ గెలిచినందుకు గర్వపడుతున్నా… ఇది అందరికీ స్పూర్తి కావాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *