25,487 సెంట్రల్ పోస్టుల ప్రకటన

* అభ్యర్థుల కోసం దరఖాస్తు దశల వారీ గైడ్.

జనం న్యూస్: దేశంలో నిరుద్యోగ యువతకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది.కేంద్ర సాయుధ పోలీసు దళాలు (CAPF), స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF), అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మెన్ (జీడీ) విభాగాల్లోఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.మెుత్తం 25,487 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 31లోపు దరఖాస్తు చేసుకోవాలి.ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పే లెవల్-3 ప్రకారం రూ.21,700 నుంచి రూ.69,100 వరకు వేతనం లభిస్తుంది. కేంద్ర సాయుధ దళాళ్లో ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గుడ్ న్యూస్ తెలిపింది. ఒకేసారి ఏకంగా 25,487 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి అర్హత ఉన్న వాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపింది. ఈనోటిఫికేషన్ ద్వారా కేంద్ర సాయుధ పోలీసు దళాలు (CAPF), స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF), అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మెన్ (జీడీ) విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 31లోపు దరఖాస్తు చేసుకోవాలి.ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తు స్వీకరణ ప్రారంభం అయిన నేపథ్యంలో అధికారిక వెబ్ సైట్ https://ssc.gov.in/ నుంచి దరఖాస్తు చేసుకోవాలని ఎస్ఎస్‌సీ ప్రకటించింది.పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి ఇది ఒక గొప్ప అవకాశం. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పే లెవల్-3 ప్రకారం రూ.21,700 నుంచి రూ.69,100 వరకు వేతనం లభిస్తుంది. డిసెంబర్ 31 వరకు దరఖాస్తుల స్వీకరణ. స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్‌సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), అస్సాం రైఫిల్స్ (AR),స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF) వంటి విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. మెుత్తం 25,487 పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాలి అని ఎస్ఎస్‌సీ తెలిపింది. నిర్దిష్ట పోస్ట్‌ను బట్టి వయోపరిమితి 18-23 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ట వయస్సులో సడలింపు ఉంటుంది. ముఖ్యమైన తేదీలు. నోటిఫికేషన్ విడుదల దరఖాస్తు ప్రారంభ తేదీ :డిసెంబర్ 1 దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ:డిసెంబర్ 31 దరఖాస్తుల్లో సవరణ: జనవరి 8 నుంచి 10 వరకు అవకాశం అధికారిక వెబ్‌సైట్: https://ssc.gov.in/ పరీక్షా విధానం: సీబీటీ(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) పరీక్షలు : 2026 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో ఫీజు వివరాలు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు దరఖాస్తు రుసుము రూ.100 చెల్లించాలి ఎస్సీ,ఎస్టీ, పీహెచ్, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము లేదు. పోస్టుల విభాగాలు: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), అస్సాం రైఫిల్స్ (AR),స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF) వయోపరిమితి: దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 23 సంవత్సరాలలోపు ఉండాలి.అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST, OBC అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానం: తొలుత అధికారిక వెబ్‌సైట్‌ https://ssc.gov.in/లోకి వెళ్ళాలి. కొత్త యూజర్ అయితే ‘New User? Register Now’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *