తెలంగాణ రాజ్‌భవన్‌… ఇకపై లోక్‌ భవన్‌

*తెలంగాణ’, వెలువడిన అధికారిక ప్రకటన

సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణ రాజ్‌భవన్ పేరును లోక్‌భవన్‌గా మార్చారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయిరాష్ట్రాలలో గవర్నర్ల, కేంద్రపాలిత ప్రాంతాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ల అధికార నివాసం ‘‘రాజ్ భవన్’’ పేరు మారుతున్న సంగతి తెలిసిందే. ఇకపై గవర్నర్ల, లెఫ్టినెంట్ గవర్నర్ల అధికారిక నివాసాలను రాజ్‌భవన్‌కు బదులుగా లోక్‌భవన్‌గా, రాజ్ నివాస్‌కు బదులుగా రాజ్ నివాస్‌గా మార్చుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాజ్‌భవన్ పేరును కూడా లోక్‌భవన్‌గా మార్చారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. దీని ప్రకారం.. ప్రస్తుతం రాజ్‌భవన్‌, తెలంగాణగా వ్యవహరిస్తున్న తెలంగాణ గవర్నర్ అధికారిక నివాసాన్ని ‘‘లోక్ భవన్, తెలంగాణ’’ అని పిలవనున్నారు. ‘‘మనం వికసిత్ భారత్ వైపు విశ్వాసంతో ముందుకు సాగుతున్నప్పుడు మన ప్రజాస్వామ్య విలువల బలం, ఉత్సాహాన్ని పునరుద్ఘాటించడానికి ఇది జరిగింది. ‘లోక్ భవన్, తెలంగాణ’ అనే కొత్త పేరు అన్ని అధికారిక ప్రయోజనాలు, సూచనలు,రికార్డుల కోసం తక్షణమే అమలులోకి వస్తుంది’’ అని ఆ ప్రకటన పేర్కొంది. వివరాలు… కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) నవంబర్ 25న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల కార్యాలయాలకు లేఖ రాసింది. రాజ్‌భవన్ పేరును రాజ్ భవన్‌గా, రాజ్ నివాస్ పేరును లోక్ నివాస్‌గా మార్చాలని అందులో పేర్కొంది. ఇప్పుడున్న పేర్లు ‘‘వలసవాదపు వాసన’’ను సూచిస్తున్నాయని… అందుకే వాటి పేర్లను మార్చాలని కోరింది. ‘‘2024 గవర్నర్ల సమావేశంలో రాజ్ భవన్లు అనే పదం వలసవాదాన్ని గుర్తుచేస్తుందని… అందుకే ‘లోక్ భవన్‌’గా పేరు మార్చాలని సూచించబడింది. దీని ప్రకారం అన్ని అధికారిక ప్రయోజనాల కోసం గవర్నర్ల కార్యాలయాలు, లెఫ్టినెంట్ గవర్నర్ల కార్యాలయాలను వరుసగా ‘లోక్ భవన్’, ‘లోక్ నివాస్’’గా పేరు మార్చాలని అభ్యర్థిస్తున్నాం’’ అని ఎంహెచ్ఏ పేర్కొంది. అయితే గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల అధికారిక నివాసాలకు పేరు మార్పు సలహాను పరిరిశీలించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాసిన లేఖకు అనుగుణంగా చాలా రాష్ట్రాల్లో చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర గవర్నర్ అధికారిక నివాసాన్ని రాజ్ భవన్ అని, కేంద్ర పాలిత ప్రాంతం లెఫ్టినెంట్ గవర్నర్ నివాసాన్ని రాజ్ నివాస్ అని పిలుస్తారనే సంగతి తెలిసిందే. కేంద్రం ఆదేశాన్ని అనుచసరించి పశ్చిమబెంగాల్, తమిళనాడు, గుజరాత్, అస్సాం, కేరళ, త్రిపుర, కేరళ, ఉత్తరాఖండ్, ఒడిశా గవర్నర్ల నివాసాల పేర్లను, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ నివాసాల పేర్లను మార్చారు. ‘‘లడఖ్‌కు ఇది ఒక చారిత్రాత్మక క్షణం. నేడు… రాజ్ నివాస్ అధికారికంగా లోక్ నివాస్‌గా పేరు మార్చబడింది. ఇది ప్రజా-కేంద్రీకృత పాలన, సమ్మిళిత అభివృద్ధి పట్ల మా లోతైన నిబద్ధతను సూచిస్తుంది”’’అని లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా కార్యాలయం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్టు చేసింది. తాజాగా ఆ జాబితాలో తెలంగాణ కూడా కూడా చేరింది. తెలంగాణ గవర్నర్ అధికార నివాసం పేరును రాజ్‌భవన్ నుంచి లోక్‌భవన్‌గా మార్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *