కర్ణాటక రాజకీయాల్లో కొత్త మలుపు: డీకే సీఎం పదవికి సిద్ధమని సిద్ధరామయ్య వెల్లడింపు

జనం న్యూస్: కర్నాటకలో సీఎం మారనున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం శివకుమార్‌కు సీఎం పదవి అప్పగించే అంశంపై ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక ప్రకటన చేశారు. హైకమాండ్ ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు డీకే శివకుమార్ సీఎం పదవిని చేపడతారని ప్రకటించారు. డీకే శివకుమార్ ఇంట్లో జరిగిన బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ అనంతరం ఈ ప్రకటన చేశారు. దీంతో డీకే శివకుమార్ సీఎం పీఠం ఎప్పుడు అధిరోహించనున్నారు అనే అంశం హైకమాండ్ కోర్టులోకి నెట్టేశారు.మరి హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో‘బ్రేక్‌ఫాస్ట్ డిప్లమసీ’ ఆసక్తికరంగా మారుతోంది. అందులోనూ కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు వేళ ఈ బ్రేక్ ఫాస్ట్ డిప్లమసీలు తరచూ జరగడం సంచలనంగా మారింది. ఇటీవలే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు బ్రేక్ ఫాస్ట్ ఇచ్చారు. తాజాగా సీఎం సిద్ధరామయ్యకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బ్రేక్ ఫాస్ట్ ఇచ్చారు. నిన్న మెున్నటి వరకు ఇద్దరి మధ్య రాజకీయపోరు నడిచింది. అంతేకాదు త్వరలోనే ఒప్పందం ప్రకారం సీఎం పగ్గాలను సైతం అందుకోవాల్సింది డీకే శివకుమార్. ఇలాంటి తరుణంలో ఇద్దరి మధ్య బ్రేక్ ఫాస్ట్ భేటీలు ఆసక్తికరంగా మారాయి. డీకే ఇంట్లో సీఎం సిద్ధరామయ్య బ్రేక్ ఫాస్ట్. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ బ్రేక్ ఫాస్ట్ ఇచ్చారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం బెంగళూరులోని సదాశివనగర్‌లో ఉన్న డీకే శివకుమార్ నివాసానికి సీఎం సిద్దరామయ్య అల్పాహార విందుకు హాజరయ్యారు. డీకే శివకుమార్, ఆయన సోదరుడు, మాజీ ఎంపీ డీకే సురేశ్‌లు సిద్దరామయ్యకు సాదర స్వాగతం పలికి ఆహ్వానిచారు. ఈ సందర్భంగా సీఎంకు పుష్పగుచ్ఛం అందించి…శాలువాతో సత్కరించారు. అనంతరం బ్రేక్ ఫాస్ట్ చేశారు.వాస్తవానికి డిసెంబర్ 8 నుంచి బెళగావిలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో వీరిద్దరూ భేటీ అవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది.ఈ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్‌లు కేవలం తాము కలిసే ఉన్నామని తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవు అని చాటిచెప్పేందుకేనని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *