పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణా గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడతకు 8,198 సర్పంచ్, 11,502 వార్డు నామినేషన్లు దాఖలు అయ్యాయి. 11 డిసెంబర్ పోలింగ్, నోటా, కొత్త నిబంధనలు ప్రధాన ఆకర్షణ. తెలంగాణా లో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ 29 తేదీ తో ముగిసింది. మొత్తంగా రెండు రోజుల్లో సర్పంచ్ స్థానాలకు 8,198 నామినేషన్లు,11,502 వార్డు మెంబర్ నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి దశలో 189 మండలాల్లోని 4,236 సర్పంచ్ గ్రామాలు, 37,440 వార్డు స్థానాలకు డిసెంబర్ 11న పోలింగ్, అదే రోజున లెక్కింపు ఉంటుంది.. ఇకపోతే మొదటి దశలో 4,200 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ 31 జిల్లాల్లోని 564 మండలాల్లో గల 12,728 గ్రామ పంచాయతీలు 1,12,242 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 1,66,55,186 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బ్యాలట్ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల్లో నోటా ఉంటుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. ముగ్గురు పిల్లలు నిబంధన సడలింపు తో ఈసారి ఎక్కువగా నామినేషన్ వచ్చాయని ఎన్నికల అధికారులు చెప్పారు. రెండో దశ ఎన్నికలు 14 నుంచి మొదలుకానున్నాయి.. ఇక నామినేషన్స్ పర్వం ముగియడంతో అభ్యర్థుల గుర్తులు కేటాయింపులు ఉంటాయి.. అటు పిమ్మట గ్రామాలలో ఇక థాయిలాల పక్రియ స్టార్ట్ అవుతుంది.. ఇప్పటికే చాలామందిని తమను గెలిపిస్తే ఉచిత నీరు, నల్ల బిల్లు, హౌస్ టాక్స్ డిసి బిల్లు, ఊర్లో ఇంటర్నెట్ అన్ని ఫ్రీ అంటూ ప్రజలను మభ్య పెట్టే పనుల్లో నిమగ్నమయ్యారు.. 11వ తేదీన ఎవరి తలరాతలు ఎలా ఉంటాయనేది చూడాలి ఇంకా చాలామంది కోట్లు కుమ్మరించి సర్పంచ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.. ఎన్నికలు ఎమ్మెల్యే ఎన్నికల్లో తలపించే విధంగా ఉన్నాయని ప్రజలు అంటున్నారు.. ఒకప్పుడు సర్పంచి గెలవాలంటే 5 నుంచి 10,000 ఖర్చు అయ్యేది కానీ ఇప్పుడు అ పరిస్థితి కనిపించడం లేదు. ఎక్కడ చూసిన లక్షలు కోట్ల రూపాయల ముచ్చటే నడుస్తుంది