ఎంఎల్సీ రాజీనామాలతో రాజకీయాల్లో భవిష్యంపై ఇంకా క్లారిటీ లేదు!

జనం న్యూస్ : ఏపీలో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసి కూటమి పార్టీలలో చేరిన నేతలు శాసన మండలి చైర్మన్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ రాజీనామాలను ఆమోదించకపోవడంపై మండిపడుతున్నారు. తమ పదవులకు రాజీనామా చేసిన ఆరుగురు ఎమ్మెల్సీలలో కొందరికి తిరిగి ఎమ్మెల్సీలుగా కూటమి ప్రభుత్వం అవకాశం కల్పించే అవకాశం ఉందని…అదే జరిగితే శాసన మండలిలో టీడీపీ బలం పెరిగే అవకాశం ఉంది అని అందువల్లే రాజీనామాలను ఆమోదించడం లేదు అని నేతలు వాపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్మెల్సీల రాజీనామాల అంశం మళ్లీ మెుదటిక వచ్చింది. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఆరుగురు తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే ఎమ్మెల్సీల రాజీనామాలు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి. వైసీపీ నుంచి నేతలు పార్టీలు మారినా రాజీనామాలు మాత్రం ఆమోదం పొందలేదు. దీంతో ఎమ్మెల్సీలు కోర్టులను సైతం ఆశ్రయించారు. అయినప్పటికీ రాజీనామాలకు మాత్రం శాసన మండలి చైర్మన్ ఆమోదం తెలపడం లేదు. అయితే ఈ కాలయాపనపై ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజీనామాలు రామోదించకపోవడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని ఆరోపిస్తున్నారు. టీడీపీ బలం పెరుగుతందనేనా? ఏపీలో వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాలను శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు ఆమోదించకపోవడంపై ఎమ్మెల్సీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే రాజీనామాలను తాత్సారం చేస్తున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. తమ పదవులకు రాజీనామా చేసిన ఆరుగురు ఎమ్మెల్సీలలో కొందరికి తిరిగి ఎమ్మెల్సీలుగా కూటమి ప్రభుత్వం అవకాశం కల్పించే అవకాశం ఉందని…అదే జరిగితే శాసన మండలిలో టీడీపీ బలం పెరిగే అవకాశం ఉంది అని అందువల్లే రాజీనామాలను ఆమోదించడం లేదు అని నేతలు వాపోతున్నారు. శాసన మండలిలో ప్రస్తుతం వైసీపీకి బలం ఉంది. ఇప్పుడు ఆ ఆరుగురు వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాలకు ఆమోదం తెలిపితే ఆ ఆరు స్థానాలు కూడా కూటమి ఖాతాలో పడతాయి. దాంతో శాసన మండలిలో టీడీపీ బలం పెరుగుతుంది. ఇది జరిగితే వైసీపీకి అటు అసెంబ్లీ ఇటు శాసన మండలిలో ప్రాతినిథ్యం మరింత తగ్గే ప్రమాదం ఉంది. అందువల్లే శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు తమ రాజీనామాలను ఆమోదింపజేయడం లేదు అని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఆమోదం లభించకపోవడం వెనుక వ్యూహం ఇదేనా? ఏపీలో కూటమి ప్రభుత్వం పలు కీలక బిల్లులను అమలులోకి తీసుకువస్తోంది. అసెంబ్లీ, శాసన మండలిలో రెండింటిలోనే బిల్లులు పాస్ అయితేనే చట్టం అవుతుంది. అయితే అసెంబ్లీలో కూటమి బలం ఉంది. కాబట్టి అసెంబ్లీలో బిల్లు పాస్ అవుతుంది.శాసన మండలిలో వైసీపీ బలం ఉన్న నేపథ్యంలో బిల్లులు పాస్ అవ్వడం ఇబ్బందికరం. అయితే ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామాలు ఆమోదిస్తే మండలిలో కూటమి ప్రాతినిథ్యం మరో ఆరు స్థానాలకు పెరుగుతుంది.క్రమంగా కూటమి బలం పెరిగే అవకాశం ఉంది.ఇది వైసీపీకి కంటగింపుగా మారిందని అందుల్లే ఆ ఆరుగురు ఎమ్మెల్సీల రాజీనామాలకు ఆమోదం లభించడం లేదు అని ప్రచారం ఉంది. ఎమ్మెల్సీలుగా కొనసాగలేం: మండలి చైర్మన్‌తో ఎమ్మెల్సీలు శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు రాజీనామాలు ఆమోదించకపోవడంతో ఇప్పటికే రాజీనామలు చేసిన ఎమ్మెల్సీలు సోమవారం ఆయనను కలిశారు.తమ రాజీనామాలను ఆమోదించాలంటూ ఆరుగురు ఎమ్మెల్సీలు శాసన మండలి చైర్మన్‌ను కలిశారు. స్పీకర్ మోషే రాజును కలిసిన వారిలో ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ,పోతుల సునీత, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జయ మంగళ వెంకట రమణ, జాకియా ఖానం ఉన్నారు. విచారణకు హాజరై వారి నుంచి రాజీనామాలకు గల కారణాలను విచారించారు. ఈ మేరకు వివరణ తీసుకున్నారు. ఆరుగురు ఎమ్మెల్సీల రాజీనామాకు గల కారణాలను శాసన మండలి చైర్మన్ అడిగి తెలుసుకున్నారు.రాజీనామా ఎందుకు చేశారనీ ఎమ్మెల్సీలుగా కొనసాగవచ్చ కదా అని శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రశ్నించారు. తాము పార్టీనీ వీడిన తరువాత ఎమ్మెల్సిలుగా కొనసాగలేమని మండలి చైర్మన్‌కు ఆరుగురు ఎమ్మెల్సీలు తెగేసి చెప్పేశారు.