సీఎం రేవంత్ స్వగ్రామానికి కొత్త సారథి

★ప్రజల విశ్వాసంతో వెంకటయ్య ఏకగ్రీవం

సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయితెలంగాణలో పంచాయితీ ఎన్నికల సందడి కొనసాగుతుంది. మొత్తం మూడు దశల్లో పంచాయితీ ఎన్నికలు జరనుండగా... తొలి దశ నామినేషన్ల స్వీకరణ నవంబర్ 29న ముగిసింది. అయితే చాలా చోట్ల సర్పంచ్ సీటు కైవసం చేసుకోవడం కోసం అభ్యర్థుల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. అయితే కొన్ని చోట్ల మాత్రం సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం నాగర్‌కర్నూలు జిల్లా వంగూరు మండంలోని కొండారెడ్డిపల్లెలో తొలి దశలో పంచాయితీ ఎన్నికలు జరపనున్నట్టుగా ఎన్నికల అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఈ నెల 27 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా... ఈ నెల 29 నామినేష్ల స్వీకరణ గడువు ముగిసింది. ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ రాగా... ఒకటే నామినేసన్ దాఖలైంది. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో గ్రామస్తులంతా గ్రామానికి చెందిన మల్లేపాకుల వెంకటయ్యను ఎన్నుకోవాలని నిర్ణయించారు. దీంతో ఆయన మల్లేపాకుల వెంకటయ్య నామినేషన్ దాఖలు చేయడంతో... దీంతో సర్పంచ్‌గా ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయింది. అలాగే గ్రామంలోని 10 వార్డులకు కూడా ఒక్కొక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో... ఆయా అభ్యర్థుల ఎన్నిక కూడా ఏకగ్రీవం అయింది. మల్లేపాకుల వెంకటయ్య విషయానికి వస్తే... ఆయన మాజీ మావోయిస్టు. 1994లో మావోయిస్టులలో చేరిన వెంకటయ్య... ఆరేళ్లకు పైగా అడవుల్లో గడిపారు. 2001లో వెంకటయ్య కల్వకుర్తి పోలీసుల సమక్షంలో లొంగిపోయారు. ఆ తర్వాత అదే పోలీసు స్టేషన్‌లో హోంగార్డుకు చేరారు. అయితే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వెంకటయ్య... ఈసారి కొండారెడ్డిపల్లి సర్పంచ్‌ స్థానం ఎస్సీకి రిజర్వ్‌ కావడంతో బరిలో నిలిచారు. ఇందుకోసం తన హోంగార్డు ఉద్యోగానికి రాజీనామా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఆయన ఒక్కరే బరిలో నిలవడంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఇక, మల్లేపాకుల వెంకటయ్య... సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంతో సన్నిహిత సంబంధాలను కలిగిఉన్నారు. రేవంత్ రెడ్డికి వెంకటయ్య చిన్ననాటి స్నేహితుడని కూడా చెబుతున్నారు.