భారత్ – రష్యా ద్వైపాక్షిక చర్చలకు రంగం సిద్ధం

★ పుతిన్ పర్యటనకు ప్రాధాన్యం.

జనం న్యూస్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు రానున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశానికి స్టేట్ విజిట్‌‌ కోసం వస్తున్నారు.రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు రానున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశానికి స్టేట్ విజిట్‌‌ కోసం వస్తున్నారు. వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4,5 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. వ్లాదిమిర్ పుతిన్... భారత్ పర్యటనకు రానుండటం విశేషమైన ప్రాముఖ్యత కలిగి ఉంది. పుతిన్ భారత పర్యటన... రాజకీయ, వాణిజ్య, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక, సాంస్కృతిక, మానవతా రంగాలలో రష్యన్-భారత సంబంధాల మొత్తం విస్తృత ఎజెండాను సమగ్రంగా చర్చించడానికి అవకాశాన్ని కల్పిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుత అంతర్జాతీయ, ప్రాంతీయ సమస్యలను పరిష్కరించుకునేందుకు పుతిన్ పర్యటన ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందంతో జరిగే చర్చలలో ఈ అంశాలు ప్రధానంగా ఉంటాయి. రష్యా అధ్యక్షుడు పుతిన. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ చర్చల అనంతరం ఒక సంయుక్త ప్రకటన ను విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే భారత్‌లో పుతిన్ పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య రక్షణ రంగ సంబంధాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టనున్నారు. కొన్ని నెలల కింద ఆపరేషన్ సిందూర్‌లో ఎస్-400 డిఫెన్స్‌ సిస్టమ్. పాక్ వైమానిక దాడులను సమర్ధవంతంగా తిప్పికొట్టి. భారత్‌కు రక్షణ కవచంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో భారత వైమానిక దళం నాలుగు రోజుల్లో పాకిస్తాన్ లోపల 300 కి.మీ కంటే ఎక్కువ దూరంలో ఉన్న బహుళ పాకిస్తాన్ ఫైటర్ జెట్‌లను, ఒక నిఘా విమానాన్ని కూల్చివేసేందుకు ఈ వ్యవస్థను ఉపయోగించినట్లు నివేదికలు సూచించాయి.సాయుధ దళాలు ఈ విజయాన్ని గేమ్-ఛేంజర్‌గా అభివర్ణించాయి.అయితే ఇప్పుడు పుతిన్ భారత పర్యటన సందర్భంగా రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ డెలివరీ ఆలస్యం కావడంపై స్పష్టత కోరాలని భారత ప్రభుత్వం యోచిస్తోందని రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ శుక్రవారం తెలిపారు. ఐదు ఎస్‌-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ల కొనుగోలుకు రష్యాతో భారత్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటివరకు నాలుగు ఎయిర్‌డిఫెన్స్ వ్యవస్థలను భారత్‌కు అప్పగించగా. మరో వ్యవస్థను వచ్చే ఏడాదికల్లా డెలివరీ చేయనుందనే తెలుస్తోంది. న్యూఢిల్లీలో ఏఎన్ఐ జాతీయ భద్రతా సదస్సులో రాజేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ డిసెంబర్ ప్రారంభంలో పుతిన్ పర్యటన ‘‘రక్షణ రంగంలో సహకారం విస్తృత అంశాల’’పై కేంద్రీకృతమై ఉంటుందని అన్నారు. అదనపు ఎస్-400 యూనిట్లను ఆర్డర్ చేసే అవకాశంపై చర్చలు జరగవచ్చని అయితే అధికారిక ప్రకటనలు ఈ సమయంలో ఆశించకూడదని అన్నారు. డెలివరీ జాప్యాలను పరిష్కరించడం, పెండింగ్‌లో ఉన్న సరఫరాల కోసం స్పష్టమైన సమయాలను పొందడంపై తమ దృష్టి ఉందని వెల్లడించారు. భారతదేశం, రష్యా విస్తృతమైన రక్షణ భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయని.. మిగిలిన S-400 బ్యాటరీలను 2026–27 ఆర్థిక సంవత్సరంలో డెలివరీ చేస్తామని భారత్‌కు రష్యా హామీ ఇచ్చిందని రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. ‘‘మనకు రష్యాతో ఒక ముఖ్యమైన రక్షణ కార్యక్రమం ఉంది. ప్రస్తుత S-400 ఒప్పందం ఆలస్యం అయింది. అయినప్పటికీ వారు ఇప్పుడు వచ్చే ఆర్థిక సంవత్సరంలో బ్యాలెన్స్‌ను డెలివరీ చేయడానికి కట్టుబడి ఉన్నారు’’ అని రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు.