జనం న్యూస్: తెలంగాణలో కొనసాగుతున్న పంచాయితీ ఎన్నికల ప్రక్రియపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.తెలంగాణలో కొనసాగుతున్న పంచాయితీ ఎన్నికల ప్రక్రియపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం- 2018లోని సెక్షన్ 285-ఏని, అలాగే నవంబర్ 22న జారీ చేసిన జీవో నంబర్ 46ని కొట్టివేయడానికి నిరాకరించింది. వివరాలు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో 46పై అభ్యంతరంపై వ్యక్తం చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, న్యాయమూర్తి జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌లతో కూడిన డివిజన్ బెంచ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. గ్రామ పంచాయితీ ఎన్నికలపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ‘‘రాజ్యాంగ నిబంధనల ద్వారా ఆదేశించబడిన ప్రక్రియను ఆపకూడదు’’ అని పేర్కొంది. ఎన్నికలను నిలిపివేయకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఉందని ప్రస్తావించింది. ఇందుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు ధర్మాసనం. తదుపరి విచారణను ఎనిమిది వారాలకు వాయిదా వేసింది. ఇక, మడివాల మచ్చదేవ రాజకుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌లో బీసీలను చట్టబద్ధంగా ఏ,బీ,సీ,డీ గ్రూపులుగా వర్గీకరించకుండా రిజర్వేషన్లు కల్పించడంకు సంబంధించిన చట్టబద్ధతను ప్రశ్నించింది. నవంబర్ 22న జారీ చేసిన జీవో నంబర్ 46ను పక్కన పెట్టాలని పిటిషనర్ కోరారు. బీసీ ఉప వర్గీకరణను పాటించకుండా, డెడికేటెడ్ కమిషన్ నివేదిక యొక్క పూర్తి డేటాను బహిర్గతం చేయకుండా ప్రభుత్వం ఈ జీవో జారీచేసిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం – 2018లోని సెక్షన్ 285-ఏని సవరించడానికి గవర్నర్‌కు బిల్లును పంపిందని. ఇందులో బీసీ రిజర్వేషన్లను42 శాతానికి పెంచాలని కోరిందని తెలిపారు. ఈ సవరణ బీసీ ఉప-వర్గీకరణకు అవకాశం ఇవ్వలేదని పిటిషనర్లు ఎత్తి చూపారు.