ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

★ మరో మూడు జిల్లాల ఏర్పాటు.

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు కొత్త జిల్లాలు, ఐదు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రక్రియలో ప్రభుత్వం దూకుడు పెంచింది. ఈ ప్రాంతాల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తాజాగా ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈక్రమంలో 3 కొత్త జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటునకు సంబంధించి ప్రాథమిక నోటీఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మూడు జిల్లాలు ఏర్పాటు చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాల ఏర్పాటుకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికను పరిశీలించిన అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఈ క్రమంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో మూడు కొత్త జిల్లాలు, ఐదు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలపై ప్రజల నుంచి అభ్యంతరాలు,సూచనలు స్వీకరించేందుకు 30 రోజులు గడువ విధించింది. ప్రాథమిక నోటిఫకేషన్. ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.3 కొత్త జిల్లాలు, 5కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.ఇకపోతే ఇటీవలే మూడు కొత్త జిల్లాలు, ఐదు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు.మార్కాపురం,పోలవరం,మదనపల్లె జిల్లాల ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేయనుంది. పోలవరం జిల్లారంపచోడవరం నియోజకవర్గంలోని రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లతో కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు కానుంది. రంపచోడవరం రెవెన్యూ డివిజన్ లో రంపచోడవరం, దేవీపట్నం, వైరామవరం, గుర్తేడు, అడ్డతీగల, గంగవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి మండలాలు ఉండనున్నాయి. ఇక చింతూరు డివిజన్ లో యెటపాక, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాలను చేర్చారు. రంపచోడవరం కేంద్రంగా కొత్తగా ఏర్పాటయ్యే పోలవరం జిల్లాలో 3.49 లక్షల జనాభా ఉంది. మార్కాపురం జిల్లా. యర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాల్లోని మార్కాపురం, కనిగిరి రెవెన్యూ డివిజన్లతో కొత్త జిల్లాగా మార్కాపురం ఏర్పాటు కానుంది. మార్కాపురం రెవెన్యూ డివిజన్ లోని యర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దారవీడు,తర్లుపాడు, మార్కాపురం, పొదిలి, కొనకనమిట్ల మండలాలు, అలాగే కనిగిరి డివిజన్ లోని హనుమంతుని పాడు, వెలిగండ్ల, కనిగిరి, పెదచెర్లోపల్లి, చంద్రశేఖరపురం, పామూరు, గిద్దలూరు, బేస్తవారిపేట, రాచర్ల, కొమరోలు, కంభం, అర్ధవీడు మండలాలు కొత్తజిల్లాల్లో ఉండనున్నాయి. మొత్తం 11.42 లక్షల జనాభాతో ఈ జిల్లా ఏర్పాటు కానుంది. మదనపల్లి జిల్లా. మదనపల్లి, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాల్లోని మదనపల్లె, పీలేరు రెవెన్యూ డివిజన్లతో కొత్తగా మదనపల్లి జిల్లా ఏర్పాటు కానుంది. మదనపల్లి రెవెన్యూ డివిజన్ లోని మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం, తంబళ్లపల్లె, ములకల చెరువు, పెదమండ్యం, కురబలకోట, పీటీ సముద్రం, బీరొంగి కొత్తకోట, చౌడేపల్లె, పుంగనూరు మండలాలు, అలాగే పీలేరు డివిజన్ లోని సదుం, సోమల, పీలేరు, గుర్రంకొండ, కలకడ, కంభంవారి పల్లె, కలికిరి, వాల్మీకిపురం మండలాలు ఉండనున్నాయి. మొత్తం 11.05 లక్షల జనాభాతో కొత్త జిల్లా ఏర్పడనుంది. రెవెన్యూ డివిజన్లలో మార్పు చేర్పులివీ. శ్రీకాకుళం జిల్లా పలాస డివిజన్‌లోని నందిగాం మండలాన్ని టెక్కలి డివిజన్ లో కలిపేందుకు మంత్రుల కమిటీ చేసిన సిఫార్సుకు ఆమోదం తెలిపారు. అనకాపల్లి జిల్లాలోని పాయకరావు పేట- యలమంచిలి నియోజకవర్గాల్లోని మండలాలతో కొత్తగా నక్కపల్లి రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. కాకినాడ డివిజన్ లోని సామర్లకోట మండలాన్ని పెద్దాపురం డివిజన్ లో విలీనం చేసేందుకు ఆమోదం తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలోని మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం, మండలాలను రాజమహేంద్రవరం డివిజన్ లో కలపాలని నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ మండలాన్ని ఇక నుంచి వాసవీ పెనుగొండ మండలంగా పేరు మార్చనున్నారు. బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలపనున్నారు. కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో విలీనం చేయనున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని కలువాయి, రాపూర్, సైదాపురంలను తిరుపతి జిల్లా గూడురు డివిజన్ లో విలీనం చేయనున్నారు. పలమనేరు డివిజన్‌లోని బంగారుపాళ్యంను చిత్తూరు డివిజన్ లో కలుపనున్నారు. సదుం, సోమల, పీలేరు, గుర్రం కొండ, కలకడ, కేబీ పల్లి, కలికిరి, వాల్మీకి పురం మండలాలతో పీలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. పలమనేరు డివిజన్‌లోని చౌడేపల్లి, పుంగనూరు మండలాలను మదనపల్లి రెవెన్యూ డివిజన్ లో విలీనం చేయనున్నారు. కడప జిల్లాలోని ఒంటిమిట్ట, సిద్ధవటంలను రాజంపేట రెవెన్యూ డివిజన్ లో కలపనున్నారు. శ్రీసత్యసాయి జిల్లాలోని మడకశిరను కొత్త రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయనున్నారు.