పంచాయితీ ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం

★ రాష్ట్రంలో తొలి దశ నామినేషన్లు స్టార్ట్.

జనం న్యూస్‌: తెలంగాణలో పంచాయితీ ఎన్నికల సందడి మొదలైంది. పంచాయితీ ఎన్నికల తొలి దశకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ గురువారం ప్రారంభమైంది.తెలంగాణలో పంచాయితీ ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించనున్నట్టుగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఇటీవల షెడ్యూల్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పంచాయితీ ఎన్నికల తొలి దశకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ గురువారం ప్రారంభమైంది. ఇందుకు ముందుగా కలెక్టర్లు ఎన్నికల నోటిఫికేషన్లు జారీ చేశారు. ఆ వెంటనే సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ల స్వీకరణ మొదలైంది. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల దాకా నామినేషన్లు స్వీకరించనున్నారు. తొలిదశలో 189 మండలాల్లో 4,236 సర్పంచ్, 37,440 వార్డుసభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశలో ఎన్నికలు జరిగే గ్రామపంచాయితీలకు సంబంధించి సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 29 వరకు కొనసాగనుంది. ఈ నెల 30 నామినేషన్ల పరిశీలన చేపడతారు. అప్పీళ్లకు డిసెంబర్ 1 వరకు అవకాశం ఇవ్వగా. డిసెంబర్ 2వ తేదీ నాటికి వాటిని పరిష్కారం చేస్తారు. డిసెంబర్ 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. ఆ వెంటనే బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. డిసెంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు బ్యాలెట్ పద్దతిలో పోలింగ్ జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఇక, రెండో దశ నామినేషన్ల స్వీకరణ నవంబర్ 30 నుంచి ప్రారంభం కాగా, పోలింగ్ డిసెంబర్ 14న జరగనుంది. మూడో దశ నామినేషన్ల స్వీకరణ డిసెంబర్ 3 నుంచి ప్రారంభం కాగా, పోలింగ్ డిసెంబర్ 17న నిర్వహించనున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు, ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని జిల్లా కలెక్టర్లు, కమిషనర్లు, ఎస్పీలు, ఇతర సీనియర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల సంసిద్ధతను సమీక్షించారు. ఇక, తెలంగాణలోని 31 జిల్లాల్లో 12, 728 సర్పంచ్ స్థానాలు, 1,12, 242 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. షెడ్యూల్ ప్రకారం మొదటి దశలో 4, 236 పంచాయతీలకు, రెండవ దశలో 4, 333 పంచాయతీలకు, చివరి దశలో 4, 159 పంచాయతీలకు పోలింగ్ జరుగుతుంది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌. మొదటి విడతలో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం: నవంబర్ 27, నామినేషన్ల చివరి తేదీ: నవంబర్ 29, నామినేషన్ల పరిశీలన: నవంబర్ 30, అప్పీల్‌కు చివరి తేదీ: డిసెంబర్ 1, నామినేషన్ల ఉపసంహరణకు గడువు: డిసెంబర్ 3, బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా: డిసెంబర్ 3, పోలింగ్ తేదీ: డిసెంబర్ 11 (ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు) ఓట్ల లెక్కింపు: డిసెంబర్ 11 మధ్యాహ్నం రెండు గంటల నుంచి రెండో విడతలో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం: నవంబర్ 30, నామినేషన్ల చివరి తేదీ: డిసెంబర్ 2, నామినేషన్ల పరిశీలన: డిసెంబర్ 3, అప్పీల్‌కు చివరి తేదీ: డిసెంబర్ 4, నామినేషన్ల ఉపసంహరణకు గడువు: డిసెంబర్ 6, బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా: డిసెంబర్ 6, పోలింగ్ తేదీ: డిసెంబర్ 14 (ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు) ఓట్ల లెక్కింపు: డిసెంబర్ 14 మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడో విడతలో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం: డిసెంబర్ 3, నామినేషన్ల చివరి తేదీ: డిసెంబర్ 5, నామినేషన్ల పరిశీలన: డిసెంబర్ 6, అప్పీల్‌కు చివరి తేదీ: డిసెంబర్ 7, నామినేషన్ల ఉపసంహరణకు గడువు: డిసెంబర్ 9, బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా: డిసెంబర్ 9, పోలింగ్ తేదీ: డిసెంబర్ 17 (ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు) ఓట్ల లెక్కింపు: డిసెంబర్ 17 మధ్యాహ్నం రెండు గంటల నుంచి