సాక్షి డిజిటల్ న్యూస్: దేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ప్రధాని మోడీ దేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1ను ప్రారంభించారు. హైదరాబాద్‌లో స్పేస్‌టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్‌ను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. శాటిలైట్‌ను తక్కువ భూమి కక్ష్య (LEO)లోకి తీసుకెళ్లే స్కైరూట్ తొలి కమర్షియల్ ఆర్బిట్ రాకెట్ విక్రమ్-1ని కూడా ఆయన ఆవిష్కరించారని టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనంలో పేర్కొంది. స్కైరూట్ ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్ 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ క్యాంపర్, మల్టిపుల్ లాంచ్ వెహికిల్ ఇంటిగ్రేటింగ్ మరియు టెస్టింగ్, డెవలపింగ్‌పై దృష్టి సారిస్తుంది. దీనితో పాటు ప్రతి నెల ఒక ఆర్బిట్ రాకెట్‌ను నిర్మించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. వేగవంతమైన, ఆన్-డిమాండ్ రాకెట్ తయారీ , ప్రయోగ సామర్థ్యాలను అభివృద్ధి చేసే ప్రయత్నాలలో భాగంగా ఈ స్టార్టప్ సుమారు రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టనుందని స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు నాగ భరత్ డాకా తెలిపారు. నవంబర్ 2022లో స్కైరూట్ తన సబ్-ఆర్బిటల్ రాకెట్, విక్రమ్-ఎస్ తో అంతరిక్షంలోకి రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ కంపెనీగా నిలిచింది. 2018లో, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ విద్యార్థులు, ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు అయిన పవన్ కుమార్ చందన మరియు నాగ భరత్ ఢాకా ఇద్దరూ కలిసి స్కైరూట్‌ను స్థాపించారు. సైకిల్‌పై రాకెట్ మోసుకెళ్లే స్థితి నుంచి మన ప్రస్థానం. ప్రధాని మోడీ ప్రారంభించిన స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ సంస్థ కావడం విశేషం.