ట్రేడింగ్ పేరుతో మోసం

* నాలుగేళ్ల తర్వాత వెలుగులోకి వచ్చిన రూ.35 కోట్ల స్కామ్

పయనించే సూర్యుడు న్యూస్ : ముంబయికి చెందిన ఓ వృద్ధ దంపతులను ట్రేడింగ్ పేరుతో నిలువునా ముంచేశారు. గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ అనే సంస్థ ప్రతినిధులు చెప్పిన మాటలకు ఆకర్షితులై చివరకు మోసపోయారు. నాలుగేళ్లు పొడువునాలాభాలు చూపిస్తూ, అనేక మంది పెట్టుబడిదార్లను ఆకర్షించారు. కానీ, చివరిలో రూ.35 కోట్ల అప్పు ఉందని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితులు తమ షేర్లను బదిలీ చేయాల్సి వచ్చింది. ట్రేడింగ్ పేరుతో ఓ 72 ఏళ్ల వృద్ధుడి నుంచి కేటుగాళ్లు నాలుగేళ్లలో రూ.35 కోట్లు దోచేశారు. ఆయన భార్య అకౌంట్ నుంచి నాలుగేళ్లుగా అనధికారిక ట్రేడింగ్ జరిపి కోట్లు సమర్పించుకున్నాడు. పరేల్‌లో క్యాన్సర్ రోగుల కోసం తక్కువ అద్దెకు గెస్ట్ హౌస్ నడుపుతున్న షా, 1984లో తన తండ్రి మరణించిన తర్వాత షేర్ పోర్ట్‌ఫోలియోను వారసత్వంగా పొందాడు. కానీ ఆ దంపతులకు స్టాక్ మార్కెట్ గురించి ఎలాంటి పరిజ్ఞానం లేకపోవడంతో వ్యాపారం చేయలేదు. అయితే, 2020లో ఈ మోసం మొదలైంది. తన భార్య పేరుతో గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ అనే సంస్థలో డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు తెరిచి, తమ వారసత్వంగా వచ్చిన షేర్లను ఆ సంస్థకు బదిలీ చేశారు. మొదట్లో అంతా బాగానే ఉన్నా, కొద్ది రోజుల తర్వాత మోసానికి తెరతీశారు. ఎలాంటి అదనపు పెట్టుబడి అవసరం లేదని, షేర్లను తనఖాపెట్టి సురక్షితంగా ట్రేడింగ్ చేయవచ్చని నమ్మబలికారు. ఇందులో భాగంగా అక్షయ్ బారియా, కరణ్ సిరోయా అనే ఇద్దరు ఉద్యోగులు షా పోర్ట్‌ఫోలియోను నిర్వహించే బాధ్యత తీసుకున్నారు. షా తన వద్ద ఉన్న ప్రతి OTP, SMS, ఈమెయిల్‌కు స్పందిస్తూ వారికి కావాల్సిన సమాచారం అంతా ఇచ్చేశారు. వారికి అవసరమైన సమాచారం మాత్రమే షాకు ఇచ్చేవారు. దీంతో వారి చేతుల్లోకి ఖాతా పూర్తిగా వెళ్లిపోయింది. మార్చి 2020 నుంచి జూన్ 2024 వరకు షాకు వచ్చిన వార్షిక స్టేట్‌మెంట్లలో లాభాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఏటా క్లీన్ స్టేట్‌మెంట్ రావడంతో మోసం జరుగుతుందని ఆయన అస్సలు అనుమానించలేదు. అనుమతి లేకుండా ట్రేడింగ్ జరిగిందని, కోట్ల విలువైన షేర్లు అమ్ముడయ్యాయని, అనేక ‘సర్క్యులర్ ట్రేడ్స్’ (ఒకే పార్టీతో జరిగిన లావాదేవీలు) వల్ల ఖాతా లోతుగా నష్టాల్లోకి వెళ్లిపోయిందని తెలిసింది. మిగతా ఆస్తులను కోల్పోతామనే భయంతో షా తన పేరుతో ఉన్న షేర్లను అమ్మి, మొత్తం రూ.35 కోట్ల చెల్లించాల్సి వచ్చింది. మిగిలిన షేర్లను వేరే సంస్థకు బదిలీ చేసుకున్నారు. గ్లోబల్ వెబ్‌సైట్ నుంచి వాస్తవ, సమగ్ర ట్రేడింగ్ స్టేట్‌మెంట్‌ను డౌన్‌లోడ్ చేసి, మెయిల్ ద్వారా వచ్చిన “లాభాల” స్టేట్‌మెంట్‌తో పోల్చినప్పుడే అసలు మోసం బయటపడింది. రెండు రికార్డుల మధ్య భారీ వ్యత్యాసాలు కనిపించాయి. ఐపీపీ సెక్షన్లు 409 (క్రిమినల్ ట్రస్ట్ బ్రీచ్) 420 (మోసం) కింద కేసు నమోదుచేసి.. తదుపరి విచారణకు ముంబై పోలీసుల ఆర్ధిక నేరాల దర్యాప్తు విభాగానికి అప్పగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *