పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణలో పంచాయితీ ఎన్నికలకు నగారా మోగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు.తెలంగాణలో పంచాయితీ ఎన్నికలకు నగారా మోగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ మద్దతు గల అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే ఆ గ్రామాల అభివృద్దికి తక్షణమే రూ. 10 లక్షలు అందేలా చేస్తాని తెలిపారు. ఈ మేరకు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని గ్రామాల ప్రజలకు బండి సంజయ్ రిక్వెస్ట్ చేశారు. ‘‘బీజేపీ మద్దతు ఉన్న అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకోండి. అభివృద్ధికి తక్షణమే ₹10 లక్షలు పొందండి’’ అని పేర్కొన్నారు. ‘‘కరీంనగర్ పార్లమెంట్ నియోజకర్గంలో మీ గ్రామం ఉన్నట్టుగా అయితే బీజేపీ మద్దతు ఉన్న అభ్యర్థిని సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే, ఆ గ్రామ అభివృద్ధికి నేను నేరుగా రూ. 10 లక్షలు నిధులు సమకూరుస్తాను. ఇందులో ఎలాంటి జాప్యాలు లేవు, సాకులు లేవు. పార్లమెంట్ సభ్యుడిగా నా దగ్గర ఎంపీ ల్యాడ్స్ నిధులు అందుబాటులో ఉన్నాయి. సీఎస్ఆర్ ద్వారా మేము కోట్లు ఎలా తెచ్చామో. విద్య, ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడంలో వాటిని ఎలా పెట్టుబడి పెట్టామో మీకు ఇప్పటికే తెలుసు. కేంద్ర మంత్రిగా, పంచాయతీలను అభివృద్ధిని బలోపేతం చేయడానికి నేను మరిన్ని కేంద్ర నిధులను సేకరిస్తాను. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు రూ. 5 లక్షలు హామీ ఇచ్చింది. ఆ మాటలు నమ్మి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో దాదాపు 70 గ్రామాలు బీఆర్ఎస్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. ఐదేళ్ల తర్వాత కూడా కేసీఆర్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు.అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలాంటి వాగ్దానాలు చేసి, ఏకగ్రీవ ఎన్నికల పేరుతో ప్రజలను మోసం చేసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లను నమ్మిన వారు ఆర్థికంగా నష్టపోయారు. రెండు పార్టీలు ఇప్పుడు అదే మోసాన్ని పునరావృతం చేయడానికి సిద్ధమవుతున్నాయి. కరీంనగర్ ప్రజలు వారి మాటలకు నమ్మవద్దని నేను కోరుతున్నాను’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.