రాష్ట్రంలోని 3.5 లక్షల మహిళలకు వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం కీలక నిర్ణయం

జనం న్యూస్: తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు గుడ్ న్యూస్... రాష్ట్ర ప్రభుత్వం 3.50 లక్షల మంది మహిళలకు వడ్డీలేని రుణాల పథకం కింద రూ. 304 కోట్లు పంపిణీ చేయనుంది. తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు గుడ్ న్యూస్... రాష్ట్ర ప్రభుత్వం 3.50 లక్షల మంది మహిళలకు వడ్డీలేని రుణాల పథకం కింద రూ. 304 కోట్లు పంపిణీ చేయనుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 25న 3.50 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలకు 304 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల పంపిణీను ఒకేసారి నిర్వహించనున్నట్టుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని సమగ్రంగా నిర్వహించాలని... మండల సమాఖ్య–గ్రామ సమాఖ్యల ముఖ్యులు తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని భట్టి సూచించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన వడ్డీ లేని రుణాల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తమ ప్రజా ప్రభుత్వం పునరుద్ధరించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. దీంతో రాష్ట్ర మహిళల్లో నమ్మకం, ధైర్యం మరింత పెరిగాయని అన్నారు. ఇప్పటికే పలుమార్లు రుణాలు పంపిణీ చేశశామని... మంగళవారం (నవంబర్ 25) రోజున మరోసారి పెద్ద ఎత్తున మహిళా సంఘాలకు రుణాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇందిరమ్మ చీరల పంపిణీని సజావుగా అమలు చేసినందుకు జిల్లా కలెక్టర్లను కూడా భట్టి ప్రశంసించారు. మండలాల నుండి వచ్చిన నివేదికలు మహిళలు చీరల నాణ్యత, డిజైన్ పట్ల సంతోషంగా ఉన్నారని తెలుపుతున్నాయని చెప్పారు. ఇక, మంత్రి సీతక్క మాట్లాడుతూ... మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు కనీసం రూ. 25,000 కోట్ల విలువైన వార్షిక బ్యాంకు లింకేజ్ రుణాలను సులభతరం చేస్తోందని, వారి తరపున వడ్డీని భరిస్తోందని ఆమె పేర్కొన్నారు.