
సాక్షి డిజిటల్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాలు ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాల ఏర్పాటుకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికను పరిశీలించిన అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. వీటితోపాటు ఐదు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు పచ్చజెండా ఊపారు.అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, ప్రకాశం జిల్లాలో అద్దంకి, మదనపల్లి జిల్లాలో పీలేరు, నంద్యాల జిల్లాలో బనగానపల్లె, శ్రీసత్యసాయి జిల్లాలో మడకశిర రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుకు నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో మూడు జిల్లాలు ఏర్పడనున్నాయి.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లాల పునర్విభజన, డివిజన్లు, మండలాల మార్పు చేర్పులపై సచివాలయంలో కీలక సమీక్ష జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు, పేర్ల మార్పులు- చేర్పులు అంశంపై చర్చిచింది. పలు ప్రాంతాల ప్రజలు, ప్రజాప్రతినిధుల అభ్యర్థలన మేరకు జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు, పేర్ల మార్పులు- చేర్పులపై ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. ఈ సమావేశంలో మూడు కొత్త జిల్లాలు, ఐదు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. తాజా నిర్ణయంతో ఏపీలోని జిల్లాల మెుత్తం 29కి చేరుకున్నాయి. వీటితోపాటు కర్నూలు జిల్లా పెద్ద హరివనాన్ని కొత్త మండలంగా ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఆదోని మండలాన్ని విభజించి హరివనాన్ని మండలం ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు అంగీకారం తెలిపారు.
ఏపీలో కొత్తగా మూడు జిల్లాలు
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మూడు జిల్లాలు ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాల ఏర్పాటుకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికను పరిశీలించిన సీఎం చంద్రబాబు నాయుడు కొత్త జిల్లాల ఏర్పాటుకు మెగ్గుచూపారు.వెలగపూడి సచివాలయంలో జిల్లాల పునర్విభజన, డివిజన్లు, మండలాల మార్పు చేర్పులపై సీఎం చంద్రబాబు సమీక్షనిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు అనగాని సత్యప్రసాద్, వి.అనిత, పి. నారాయణ, బీసీ జనార్ధన్ రెడ్డి, నిమ్మల రామానాయుడులు హాజరయ్యారు. కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటుపై ఇప్పటికే అధ్యయనం చేసిన మంత్రుల కమిటీ నివేదికను సీఎం చంద్రబాబు నాయుడుకు అందజేసింది. మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై కసరత్తు చేసిన సీఎం చంద్రబాబు నాయుడు మూడు జిల్లాల ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. అలాగే ఐదు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.